రౌండప్ 2022 ఉప రాష్ట్రపతి వెంకయ్యకు ఫేర్ వెల్
posted on Dec 26, 2022 @ 11:51AM
ఆగష్టు
ఉపరాష్ట్రపతి వెంకయ్యకు వీడ్కోలు .. రాజీవ్ జయంతి ..బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ 8 సారి ప్రమాణ స్వీకారం ... ఈడీ సోదాలు .. అరెస్టులు ..ఇంకా కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
ఆగష్టు 1... రూ 1,034 కోట్ల రూపాయల పాత్రా చావ్లా భూ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ ను మనీ లాండరింగ్ నియంత్రన చట్టం పరిధిలో అరెస్ట్ చేసింది.
ఆగష్టు 1... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు.
ఆగష్టు 2... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అద్యక్షుదు రాహుల్ గాంధీ విచారణ ఎదుర్కుంటున్నా నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయాలు అన్నింటిలో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లోని పత్రిక కార్యాలయాన్ని ఈడీ తత్కాలికంగా సీల్ చేసింది.
ఆగష్టు 3... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు.మమత మత్రివర్గంలో సీనియర్ మంత్రి పార్థా చట్టేర్జీ అరెస్ట్ నేపధ్యంగా చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బీజేపీ నుంచి తృణమూల్’లో చేరిన మాజీ కేంద్ర మంత్రి బాబులాల్ సుప్రియ సహా తొమ్మిదిమంది కొత్తవారికి అవకాశం కల్పించారు.
ఆగష్టు 4... పాత్రా చావ్లా భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ భార్య వర్షా రౌత్’కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సామాన్లు జారీ చేసింది. కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంకా వాద్రా, వర్షా రౌత్’కు మద్దతు తెలిపారు. ఈడీ చర్యను ఖండించారు.
ఆగష్టు 5.. ధరల పెరుగుదల, పెరుగతున్న నిరుద్యోగ సమస్య, అత్యవర సరకులపై జీఎస్టీ పెంపుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఎఐసీసీ కరలయం వద్ద మొదలైన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర రంజన్’ సహా పార్టీ ఎంపీలు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. పోలీసులు రాహుల్ గాంధీ సహా సుమారు 200 కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు.
ఆగష్టు 8... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి రాజ్యసభలో వీడ్కో లు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి అభినందనలు తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు.. యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.
వెంకయ్య నాయుడు కొత్తతరంతో మమేకమయ్యారని మోదీ పేర్కొన్నారు. ఆయన వాక్‌చాతుర్యం అందరికీ తెలిసిందేనన్నారు. భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు. చైర్మన్ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. పెద్దల సభ గౌరవ మర్యాదలను మరింత పెంచారన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించిన ప్రధాని.. అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్పూర్తిదాయకమని, ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాని బుల్‌డోజర్లతో కూల్చివేశారు అధికారులు. నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఈ ఇంటికి సోమవారం ఉదయం పోలీసు బృందాలతో వెళ్లారు. అనంతరం త్యాగి ఇంటి ముందు భాగాన్ని కూలగొట్టారు.
ఆగష్టు 9.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే మంత్రి వర్గాన్ని విస్తరించారు. శివసేన, బీజేపీ నుంచి ఎనిమిది మంది చొప్పున మొత్తం 18 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ బంధాన్ని తెన్చుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆగష్టు 10.. బీహార్ ముఖ్యమంత్రిగా జెడి (యు) నేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గవరుర్ ఫాగూ చౌహాన్.. ఆయనతో ప్రమాణం చేయించారు. ఆర్‌జెడి నాయకుడు తేజస్వీ యాదవ్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మహా కూటమిలోని ఏడు పార్టీల నాయకులు, తేజస్వీ తల్లి రబ్రీదేవీ, సతీమణి, సోదరుడు తేజ్ ప్రతాప్ తదితరులు హాజరయ్యారు.
బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ తీరు పట్ల ఆగ్రహంతో ఉను నితీష్ ఆ కూటమికి దూరమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆర్‌జెడి నేతృత్వంలోని 'మహాఘట్‌బంధన్'కు మళ్లీ దగ్గరయ్యారు. సిఎంగా రాజీనామా చేసిన నితీష్.. ఆర్‌జెడి, కాంగ్రెస్, వామపక్షాల సహకారంతో గంటల వ్యవధిలోనే మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆగష్టు 20.. మాజీ ప్రధాని రాహుల్ గాంధీ జయంతి ... సోనివై, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నాయకులు రాజీవ్’ ఘన నివాళి అర్పించారు.