శ్రీ కాళహస్తిలో రోజా దిష్టిబొమ్మ దగ్ధం
posted on Apr 19, 2025 @ 10:09PM
తిరుపతిలో మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాళహస్తిలో శనివారం ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్. శ్రీకాళహస్తిలోని పెళ్లి మంటపం సెంటర్ లో ఆ నియోజకవర్గ ఇన్ చార్జ్ వినుత కోటా రోజా దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి, ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోజా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు.
రోజాకి నగిరి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పారనీ, అయినా ఆమె మారలేదనీ విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు మానుకోకుంటే సహించేది లేదని హెచ్చరించారు. పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ చిల్లర మాటలు మాట్లేడేందుకు ఎంత ప్యాకేజీ తీసుకున్నావో చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు దిష్టిబొమ్మ దగ్ధంతో రుకుంటున్నామనీ, మరోసారి పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, నిరాధార ఆరోపణలు చేసినా ఆమె ఇంటిని ముట్టడించి అక్కడే బుద్ధి చెబుతామని నినుత కోటా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన వీరమహిళలు, జనసేన కార్యకర్తలూ పాల్గొన్నారు.