ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంః 23 మంది మృతి
posted on May 16, 2020 @ 10:51AM
ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఆ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో వాహనం ఢీకొట్టింది. దీంతో 24 మంది వలసకూలీలు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఔరాయా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. రాజస్థాన్ నుండి యూపీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
భాదితులంతా వలస కూలీలుగా గుర్తించారు. లాక్‌డౌన్ నేపథ్యంతో వీరంతా రాజస్థాన్ నుంచి స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ఓ ట్రక్కులో వస్తుండగా.. ఔరయా నుంచి ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఔరయా వద్ద రెండు ట్రక్కులు ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. ఎదురెదురుగా అతివేగంతో వస్తున్న ఈ ట్రక్కులు అదుపుతప్పి ఢీకొట్టినట్టు భావిస్తున్నారు.