2050 నాటికి ముంబై కనుమరుగు అవ్వనుందా?
posted on Oct 31, 2019 @ 12:37PM
ఈ భూమి మీద మానవాళికి అణ్వాయుధాలు శత్రువు కాదు. పక్కనున్న పాకిస్తాను అంతరిక్షంలో ఉన్న ఏలియన్స్ తో ఎలాంటి ముప్పూ తెలియదు కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి త్వరలోనే తుడిచిపెట్టుకు పోయేలా కనిపిస్తోంది. తాజా పరిశోధనలు చేస్తున్న హెచ్చరికలు కొత్త భయాలకు కారణమవుతున్నాయి. గతంలో ఊహించిన దానికంటే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ తో మహా మహా నగరాలకు ముప్పు వాటిల్లనుందని చెబుతున్నాయి. ముంబై దేశ ఆర్ధిక రాజధాని, రెండు వేల యాభై తర్వాత ఈ నగరం కనిపించదు అంటోంది తాజా పరిశోధన. సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో రెండు వేల యాభై నాటికి ముంబయిలో చాలా భాగం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని చెబుతోంది.
న్యూజెర్సీకి చెందిన క్లైమేట్ సెంట్రల్ అని సైన్స్ ఆర్గనైజేషన్ తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి న్యాచురల్ కమ్యునికేషన్స్ పేరుతో కథనం ప్రచురించింది. ఈ అధ్యయనం ప్రకారం సముద్ర మట్టాలు నానాటికి పెరుగుతుండటంతో రెండు వేల యాభై నాటికి నూట యాభై మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి హై టైడ్ లైన్ కిందకు కుంగే ప్రమాదముందని చెబుతోంది. ఇందులో మన ముంబై కూడా ఉంది. ముంబైలోని చాలా భాగం సముద్ర అలల దెబ్బకు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఈ అధ్యాయనం చెబుతోంది. కమర్షియల్ ప్రాంతాల్లో విస్తరించటం భవంతుల నిర్మాణాలే ఈ నగరానికి పెను ముప్పుగా చెబుతున్నారు. నిజానికి ఇప్పుడున్న ముంబై ప్రాంతమంతా ఒకప్పుడు దీపాల సమాహారం వాటన్నిటినీ కలిపి ముంబై నగరాన్ని నిర్మించారు. కానీ ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా విస్తరించాల్సిన నగరం ఇష్టారీతిన నిర్మాణాలతో ముప్పుకు దగ్గరగా వెళ్తుంది, రెండు వేల యాభై నాటికి ఇది పూర్తిగా సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందంటున్నారు.
సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో రెండు వేల యాభై నాటికి తీర ప్రాంతాలు భూభాగంలోకి ఎలా చొచ్చుకుపోతాయి అనే అంశాలను ఈ అధ్యయనంలో పూర్తిగా వివరించారు. తాజా రీసెర్చ్ గత అంచనాలకు భిన్నంగా ఉండటం షాక్ కు గురి చేస్తున్నాయి. గతంలో ఇదే రెండు వేల యాభై లోపు ముంబై నగరం ఎలా ముంపుకు గురవుతుంది. తాజా అధ్యయనంలో పరిస్థితి ఎలా ఉందన్న దానిపై పూర్తిగా వివరించారు. అయితే ఇపుడు ముంపు శాతం గత అధ్యాయనం కంటే పెరగడమే ఆందోళనకు గురిచేస్తోంది. ముంబై మాత్రమే కాదు తీర ప్రాంతాల్లో ఉండే మహానగరాలకు ముప్పు తప్పదని ఈ రీసెర్చి చెపుతోంది.
ఇక దక్షిణ వియత్నాం అయితే పూర్తిగా రూపురేఖలు లేకుండా కనుమరుగయ్యే ప్రమాదముంది. అందుకే రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించాలంటున్న శాస్త్రవేత్తలు ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ అనేక అనర్థాలకు కారణమవుతుంది. చెట్లు నరికివేయడం కాలుష్యంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలతో నగరాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మహామహా నగరాలన్నీ సంద్రంలో కలిసిపోవడం ఖాయం అని సమాచారం. ప్రస్తుతం ఆర్ధిక కేంద్రాలుగా ఉన్న మహానగరాలు పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోతాయి అని సమాచారం. షాంఘై, బ్యాంకాక్,బస్రాతో పాటు ప్రముఖ నగరాలన్నీ రెండు వేల యాభై తరవాత కనిపించే అవకాశం లేదంటున్నారు.ఇప్పటికైనా మేల్కోకపోతే వినాశనమే అని వాతావరణ నిపుణులు వెల్లడించారు.