మీకు చెవులలో శబ్దాలు వినిపిస్తుంటాయా అయితే కొంప మునిగినట్టే..

మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి, అందుకే ఏదైనా ఒక భాగంలో సమస్య తలెత్తితే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా గుండె-ఊపిరితిత్తుల వంటి అవయవాలలో ఏర్పడే సమస్యల గురించి మనమందరం  అప్రమత్తంగా ఉంటాము. ఆ సమస్యల గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కళ్ళు,  చెవులు వంటి అవయవాల ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపం. ఆరోగ్య నిపుణులు  కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ ఈ అవయవాలలో సమస్యలు  తీవ్రమైన దుష్ప్రభావాల ప్రమాదాన్ని కూడా కలిగిస్తాయి.

చాలామంది చెవులలో ఒకరకమైన శబ్ధం రావడం గమనిస్తుంటారు. ఇదొక టోన్ లాను, సముద్రపు హోరు లానూ, బీప్ వంటి శబ్ధం లాను ఉంటుంది. చాలామంది ఇదేమి చేస్తుందిలే.. తగ్గిపోతుంది. మనకు బాగా వినిపిస్తోంది కదా అనే నిర్లక్ష్యంతో పట్టించుకోరు. కానీ ఈ చెవి సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది  దీర్ఘకాలిక ప్రమాదాలను కలిగి ఉండే ప్రమాదముంది. ఇలా శబ్ధం వినిపించడాన్ని టిన్నిటస్ అని అంటారు. 

టిన్నిటస్ సమస్య..

 టిన్నిటస్ సమస్యలో  చెవులలో ఒకటి లేదా రెండింటిలో రింగింగ్ లేదా ఇతర శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇవి బయట నుండి వినిపించేవి కాదు. ఈ శబ్దాలు కేవలం ఈ సమస్య ఉన్నవ్యక్తులకే వినిపిస్తుంది . ఇతరులు దీన్ని వినలేదు. టిన్నిటస్ అనేది చాలా సాధారణ సమస్య  15% నుండి 20% మంది వ్యక్తులను ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో ఇది వస్తుంటుంది. సాధారణంగా టిన్నిటస్ అనేది అంతర్లీన సమస్య వల్ల వస్తుందని, దానిని గమనించి చికిత్స చేయవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు..

ఆరోగ్య నిపుణులు, టిన్నిటస్ ను సాధారణంగా వయస్సు-సంబంధిత వినికిడి లోపం, చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్  వంటి అంతర్లీన సమస్య వల్ల సంభవించవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితులను సకాలంలో గుర్తించకపోతే లేదా చికిత్స చేయకపోతే, దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

టిన్నిటస్ సమస్యకు  జలుబు వంటి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు, దీని గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమస్యకు  సమయానికి చికిత్స చేయకపోతే, ఇది చెవికి సంబంధించి అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది, చెవుడు కూడా వ్వచే అవకాశం ఉంటుంది. 

వినికిడి సమస్య శాశ్వతంగా తగ్గిపోవచ్చు..

ఆరోగ్య నిపుణులు అంటున్నారు, మన చెవి లోపలి భాగంలో చిన్న, సున్నితమైన కణాలు ఉంటాయి, అవి ధ్వని తరంగాలను స్వీకరించినప్పుడు కంపిస్తాయి. లోపలి చెవిలో ఏదైనా సమస్య ఉంటే, అది టిన్నిటస్‌కు కూడా కారణమవుతుంది.  సమయానికి చికిత్స చేయకపోతే, చెవుల శక్తి  తగ్గిపోతుంది. ఇది కాకుండా, చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిలో ఏవైనా అడ్డుపడటం వల్ల కూడా  ఈ సమస్య రావచ్చు.

చెవి ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే, మెదడు మాత్రమే కాకుండా ఇతర భాగాలపై కూడా దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది.

 

                             *నిశ్శబ్ద.