రేవంత్‌రెడ్డి సెటిల్‌మెంట్ చేశాడు,తేల్చిన సిబిసిఐడి
posted on Jun 23, 2012 @ 2:24PM
మహబూబ్‌నగర్ జిల్లా తలకొండ మండలం చల్లంపల్లిలో 25ఎకరాల 26గుంటల భూమిని ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భానుకిరణ్, డి.కృష్ణలతో పాటు స్థలయజమాని తుమ్మల సునీతను కూర్చోపెట్టి తెలుగుదేశం కొండగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సెటిల్‌మెంట్ చేశారని సిబిసిఐడి వెల్లడిరచింది. దీనికి సరైన ఆధారాలు లభించాయని ఆ విచారణ సంస్థ స్పష్టం చేసింది. భానుకిరణ్‌కు సంబంధించిన అన్ని భూదందాలపై సిబిసిఐడి విచారణ చేస్తోంది. దానిలో భాగంగానే ఈ భూవివాదం పూర్తి వివరాలను సేకరించింది. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండ మండలం చల్లంపల్లిలో తుమ్మల సునీత, ఆమె తండ్రి బోజిరెడ్డిలు ఈ 25ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొంత కాలం తరువాత సునీత అమెరికా వెళ్లిపోయారు. హైదరాబాద్‌లోనే ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే బోజిరెడ్డి అకస్మాత్తుగా మృతి చెందారు. సునీతకు చెందిన ఈ భూడాక్యుమెంట్లు భాను సంపాదించాడు. ఆయన ఆ భూమిని కాజేసేందుకు పథకం రచించాడు. వేరే మహిళను సునీత స్థానంలో చూపించి ఆమెను తీసుకువెళ్లి తమ పేరిట రిజిస్ట్రేషను చేయించుకున్నారు. డి.కృష్ణ, భాను చేసిన ఈ పని తెలుసుకున్న రేవంత్‌రెడ్డి సునీతను అమెరికా నుంచి రప్పించారు. తానే దగ్గర ఉండి వ్యవహారాన్ని సెటిల్ చేశారు. అయితే తన ప్రమేయం లేదని రేవంత్‌రెడ్డి అంటున్నారు.