యూనివర్సిటీల్లో రీసెర్చిస్కాలర్స్‌పై లైంగికవేధింపులు?
posted on Aug 18, 2012 @ 3:20PM
దేశంలోని పలు యూనివర్సిటీల్లో రీసెర్చిస్కాలర్స్‌పై ప్రొఫెసర్ల జరుపుతున్న లైంగికవేధింపులు ఎక్కువగా వెలుగులోకి రావడం లేదు. కానీ, కొందరు స్కాలర్స్ భరించలేని స్థితిలో బయట పడుతుంటారు. అప్పుడు మీడియా ద్వారా కథనాల రూపంలో ఈ వేధింపులు బయటపడతాయి. వెంటనే సంబంధిత ప్రాంతంలోని విద్యార్థిసంఘాలు ఆ ప్రొఫెసర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో యూనివర్సిటీ పెద్దలు కూడా విచారణ చేస్తుంటారు. ఒక్కోసారి పోలీసులు ఈ వేధింపుల ఆథారాలు సేకరించి ప్రొఫెసర్లపై కేసులు కూడా పెడుతుంటారు. అయితే ఈ వేధింపుల వ్యవహారం మాత్రం పలురూపాల్లో ఉంటుంది.
దీనిపై కన్నేసిన కొన్ని అంతర్జాతీయసంస్థలు ఈ వేధింపులను నీలిచిత్రాలుగా కూడా ప్రదర్శిస్తుంటారని సమాచారం. తాజాగా తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో ప్రొఫెసరు రాజేశ్వరరావు, ఆయన భార్య ప్రొఫెసర్ విజయకుమారి ఇటువంటి లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్నారు. ఈ దంపతుల్లో భర్త రాజశ్వేరరావు లైంగికంగా వేధిస్తుంటే భార్య విజయకుమారి ఆయనకు మద్దతు పలికేదట. అందుకే పోలీసులు రంగప్రవేశం చేసి ఈ దంపతులను అరెస్టు చేశారు. సీిఐడీ డిఐజి దామోదర్ కేసునమోదు చేశామని ధృవీకరించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రొఫెసర్లు రాజేశ్వరరావు అరెస్టు వార్త తెలుసుకుని తాము జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ఉన్నతచదువులు చదివిన వారే ఇలా తయారైతే ఎలా అని పలువురు విద్యావంతులు ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువుకు విద్యార్థులు తమ పిల్లలతో సమానమని, ఆ తరహాలో నైతికప్రవర్తన అలవర్చుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.