రేణుకా చౌదరి గోబ్యాక్
posted on Feb 8, 2014 @ 2:31PM
ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద ఎంపీ రేణుకా చౌదరికి చేదు అనుభవనం ఎదురైంది. భద్రాచలం డివిజన్, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపకూడదంటూ ఏపీభవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ ధర్నాకు దిగారు. వీరికి ఎంపీ రేణుకాచౌదరి మద్దతు తెలిపేందుకు అక్కడి వెళ్లగా, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు అభ్యంతరం తెలిపారు. రేణుకాచౌదరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులపై రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తర్వాత ఇరువురు శాంతిచడంతో రేణుకాచౌదరి ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరి మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ తెలంగాణదే అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క గ్రామాన్ని ఒదులుకోబోమని రేణుకాచౌదరి తెలిపారు.ఖమ్మం జిల్లాలో భద్రచలానికి ప్రత్యేక స్థానం ఉందని, భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవడం తమ లక్ష్యమని రేణుకా చౌదరి చెప్పారు. రామాలయం ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె స్పష్టం చేశారు.