Read more!

ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంటుందా..అయితే ఇది తెలుసుకోండి!

అలసట.. చాలాసార్లు అలసట అనేది తీవ్రశారీరక శ్రమ చేసినప్పుడు కలుగుతూ ఉంటుంది. అలసట కారణంగా శరీరమంతా బలహీనంగా ఉంటుంది. ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఏ పనులు  చేయాలన్నా చిరాగ్గా ఉండటం. బద్దకం వంటి సమస్యలు చుట్టుముడతాయి. చాలామంది అలసటగా ఉన్నవారిని బద్దకిష్టులు అంటూ  ఉంటారు. అయితే అది బద్దకం కాదు.. మనిషి శారీరక స్థితిలో మార్పు.  ముఖ్యంగా శరీరంలోపల హార్మోన్లు, అవయవాల పనితీరులో అసమతుల్యత ఏర్పడటం. దీన్ని గుర్తించి సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి.

అలసటకు కారణాలు..

అలసటకు ప్రధాన కారణం తప్పుడు ఆహారాలు తీసుకోవడం. ఆహారాల కారణంగా శరీరం ప్రభావితమవుతుంది. సరైన ఆహారాన్ని ఎక్కువరోజులపాటు తీసుకోకుండా దాని స్థానంలో తప్పుడు ఆహారం తీసుకుంటే అది శారీరక బలహీనత, రక్తహీనత వంటి సమస్యలకు కారణం అవుతుంది. దీన్ని పరిష్కరించాలంటే కింది నాలుగు రకాల ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.

తృణధాన్యాలు..

దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే వారి రహస్యం తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం. ఓ ఇరవై ముప్పై ఏళ్ళ కిందట అన్నీ ఆరోగ్యకరమైన పంటలే ఉండేవి. ప్యాక్డ్ ఫుడ్స్, నిల్వ ఆహారాలు వంటివి  అప్పుడు తక్కువ. చాలావరకు చిరుతిళ్ళు కూడా తృణధాన్యాలతోనే చేసేవారు. అందుకే నాటికాలం వారి ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువ మొత్తం ఉంటుంది. విటమిన్లు కూడా మెండుగా ఉంటాయి.  శుద్ది చేసిన పిండులు, శుద్ది చేసిన బియ్యం వంటి వాటిని తగ్గించి తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్రౌన్ రైస్, పొట్టు తీయని గోధుమలు, రాగులు, జొన్నలు వంటివి వినియోగించాలి.

రంగురంగుల పండ్లు..

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివనే విషయం తెలిసిందే. పండ్లలో విటమిన్లు,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లు పుష్కలంగా ఉంటాయి. పండ్లు రంగురంగులో ఉంటాయి. కంటికి ఇంపుగా కనిపించే ఈ పండ్లు ఆరోగ్యం చేకూరుస్తాయి. అలసటను మంత్రించినట్టు మాయం చేస్తాయి.  

                                                       *నిశ్శబ్ద.