కాళ్లు చేతులలో జలదరింపు, చీమలు పాకిన ఫీలింగ్ ఉందా? ఇదే కారణం..!

 

శరీరంలో అనారోగ్యం లేదా ఏదైనా లోపం ఉంటే అది వివిధ రూపాలలో బయట పడుతూ ఉంటుంది.  శరీరంలో ఎక్కడైనా ఉంటే అది ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. కానీ శరీరానికి ఎంతో  అవసరమైన విటమిన్లు లోపిస్తే అది శరీరంలో మార్పులు,  లక్షణాల ద్వారా బయట పడుతుంది.  కొందరికి కాళ్లు చేతులు తరచుగా జలదరిస్తుంటాయి.  విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు,  నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి కాళ్లు, చేతుల మీద చీమలు పాకినట్టు, చీమలు కుట్టినట్టు, ఏదైనా పిన్నీసు తీసుకుని పొడినట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.  ఇదంతా విటమిన్ల లోపం కారణంగా జరుగుతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకూ ఈ సమస్యకు కారణమయ్యే విటమిన్ ఏది? ఆ విటమిన్ ఏ ఆహారాలలో లభ్యమవుతుంది? తెలుసుకుంటే..


విటమిన్-బి12..


శరీరంలో విటమిన్-బి12 అవసరం చాలా  ఉంటుంది.  ఇది నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం.  విటమిన్-బి12 లోపిస్తే నరాల పనితీరు దెబ్బతింటుంది.  నరాల పనితీరు సరిగా లేకుండా శరీరంలో నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.  దీని కారణంగానే చేతులు, కాళ్లలో జలదరింపు,  చీమలు పాకిన ఫీలింగ్, తిమ్మిర్లు ఎదురవుతూ ఉంటాయి.


విటమిన్-బి12 ఆహారాలు..

విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.

మాంసాహారులు..

సాధారణంగా విటమిన్-బి12 మాంసాహారంలో ఎక్కువగా లభ్యమవుతుంది.  

చేపల్లో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది.  సాల్మన్, సార్టినెస్, ట్రౌట్ వంటి చేపలలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది.  వీటిలో వారంలో కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి.


గుడ్లు కూడా విటమిన్-బి12 ను అందిస్తాయి.  ముఖ్యంగా గుడ్లలో ఉండే పచ్చ సొనలో విటమిన్-బి12 ఉంటుంది.  దీంతోపాటు విటమిన్-బి2 కూడా ఇందులో ఉంటుంది. వారంలో కనీసం 3 లేదా 4 సార్లు  గుడ్లను ఆహారంలో తీసుకోవాలి.


మాంసాహారులు విటమిన్-బి12 మెరుగ్గా పొందడానికి చికెన్ మంచి మార్గం.  వారానికి కనీసం ఒక్కసారి అయినా చికెన్ తీసుకుంటే మంచిది.

శాకాహారులు..

శాకాహార ఆహారాలలో కూడా విటమిన్-బి12 లభ్యమవుతుంది.

పాలలో విటమిన్-బి12 లభిస్తుంది. కేవలం విటమిన్-బి12 మాత్రమే కాకుండా ప్రోటీన్, కాల్షియం, విటమిన్-డి కూడా పాల నుండి లభిస్తాయి.


విటమిన్-బి12 లోపాన్ని అధిగమించాలంటే తృణధాన్యాలు బాగా తీసుకోవాలి.  వీటిని తీసుకుంటే శరీరానికి విటమిన్-బి12 బాగా అందుతుంది.


పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విటమిన్-బి12 సమృద్దిగా అందుతుంది. పెరుగులో విటమిన్-బి12 మాత్రమే కాకుండా ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహకరిస్తాయి.


బీట్రూట్ లో కూడా విటమిన్-బి12 ఉంటుంది.  బీట్రూన్ ను జ్యూస్,  సలాడ్,  స్మూతీ గా మాత్రమే కాకుండా.. కూరలలో కూడా భాగం చేసుకోవచ్చు.


                                                         *రూపశ్రీ.