మేడ్చల్ జిల్లాలో రియాల్టర్ హత్య
posted on Dec 8, 2025 @ 9:40AM
హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని కాప్రా సాకేత్ కాలనీలో సోమవారం (డిసెంబర్ 8) ఉదయం వెంకటరత్నం అనే రియల్టర్ దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంటి నుంచి బైక్ పై బయలుదేరిన వెంకటరత్నంను సాకేత్ కాలనీలోని ఫాస్టర్ బిలభాంగ్స్ స్కూల్ వద్ద గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు.
ముందుగా రివాల్వర్ తో కాల్పులు జరిపి, ఆ తరువాత విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హత మార్చారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఘటనాస్థలంలోని బుల్లెట్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉండగా హతుడు వెంకటరత్నంపై గతంలో దౌలి పేట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉందనీ, అలాగే ఓ జంట హత్యల కేసులో కూడా నిందితుడని తెలు స్తోంది. కాగా ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వెంకట రత్నం హత్య కు సంబంధించి అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.