ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఆరోగ్య పరిస్థితి విషమం
posted on Dec 28, 2012 4:52AM
ఢిల్లీ రేప్ బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రత్యెక చికిత్స కోసం ఆమెను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. తమ ఆసుపత్రిలోని ఐసియూ విభాగంలో ఆమెకు చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నిన్న సాయంత్రం 4.30 గంటలకు ఈ ఆసుప్రతి వర్గాలు విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు.
బహుళ అవయవాల మార్పిడి సదుపాయాలున్న ఈ ఆసుపత్రిని 1973లో ఏర్పాటు చేశారు. ఇది 373 పడకల ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి వైద్య చికిత్స కోసం వస్తూ ఉంటారు. ప్రత్యేక విమానంలో ఆమెను నిన్న ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సింగపూర్ తీసుకువచ్చారు. సింగపూర్ లోని భారత హై కమీషన్ అధికారులు బాధితురాలి తల్లి తండ్రుల కోసం ఓ ప్రత్యెక సమన్వయ అధికారిని ఏర్పాటు చేశారు.
భాదితురాలి కుటుంబ సభ్యులు బస చేసిన హోటల్ గదిలో ఈ అధికారి రోజు మొత్తం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. బాధితురాలి ఆరోగ్యానికి అయ్యే ఖర్చు విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హోం మంత్రి షిండే ప్రకటించిన విషయం తెలిసిందే.