స్వాతిని చంపిన నిందితుడు జైల్లో ఆత్మహత్య
posted on Sep 19, 2016 @ 11:21AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని పొట్టనబెట్టుకున్న ప్రేమోన్మాది రామ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్వాతి హత్య అనంతరం పోలీసులు రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నైలోని పుజల్ జైలుకు పంపారు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఖైదీలంతా భోజనం చేస్తున్న వేళ జైలు ప్రాంగణంలోని కరెంట్ తీగను నోటితో పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అధికారులు వెంటనే రాయపేట ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు రామ్‌కుమార్ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. చెన్నై ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న స్వాతిని ఈ ఏడాది జూన్ 24న నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు రామ్‌కుమార్. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలోనే రామ్‌కుమార్ బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.