టీఆర్ఎస్ కు రామచంద్రు తేజావత్ గుడ్ బై
posted on Jul 23, 2022 @ 4:45PM
తెరాస నుంచి వలసలు పెరుగుతున్నాయి. పార్టీకి గుడ్ బై చెప్పేవారి సంఖ్యా క్రమంగా పెరుగుతోంది. ఆ క్రమంలో తాజాగా మాజీ ఐఏఎస్ రామచంద్రు తెజావత్ టీఆర్ఎస్ కుగుడ్ బై చెప్పారు. ఇప్పటి వరకూ రామచంద్రు తేజావత్ టీఆర్ఎస్ కు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిథిగా పని చేస్తున్నారు. తన రాజీనామాకు ఆయన చెప్పిన కారణం ఇటీవల పార్టీ తీసుకున్న నిర్ణయాలు తనకు నచ్చడం లేదన్నది. రామంచంద్రు తెజావత్ మాజీ ఐఏఎస్ అధికారి.
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు తెరాస మద్దతు ఇవ్వకపోవడం తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ పదవికీ కూడా రాజీనామే చేసినట్లు వెల్లడించిన రామచంద్రు తేజావత్..టీఆర్ఎస్ పార్టీకీ, ప్రభుత్వానికి సేవ చేద్దామని తాను భావించినా, పార్టీ కానీ, ప్రభుత్వం కానీ తన సేవలను ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిథిగా తన విధులను వంద శాతం చిత్తశుద్ధితో నిర్వర్తించినట్లు చెప్పిన ఆయన కాళేశ్వరం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులకు క్లియరెన్స్ వచ్చే విషయంలో విశేష కృషి చేశానన్నారు. అలాగే సికింద్రాబాద్ కరీంనగర్ రైల్వే లైన్, నేషనల్ హైవే ప్రాజెక్టులు, ఎయిమ్స్, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల సాధనలో కూడా తన పాత్ర ఉందని పేర్కొన్నారు.