Read more!

హైదరాబాదు పేలుళ్లపై రామ్ గోపాల్ వర్మ స్పందన

 

ముంబయిపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ‘26/11 దాడులు’ అనే సినిమాగా మలిచిన రామ్ గోపాల్ వర్మ, ఆ ప్రయత్నంలో అనేక మంది బాధితులను, హతుల కుటుంబాలను కలిసి వారి హృదయ విదారక గాధలు విని కదిలిపోయానని ఇటీవల ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. ఆ అనుభవం తన ఆలోచనలో చాలా మార్పులు కూడా తెచ్చిందని, ఆయన పేర్కొన్నారు. భాదితుల కుటుంబాలను అందరికంటే దగ్గరగా చూసిన ఆయనకి, నిన్న హైదరాబాదులో జరిగిన బాంబు దాడులలో భాదితుల గోడు అర్ధం చేసునందునేమో, కొంచెం ఆవేశంగా ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ట్వీటర్ లో తీవ్ర విమర్శలు చేసారు.

 

ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ ‘బాంబు ప్రేలుళ్ళను ఖండిస్తున్నాను’ అనే ఆయన చెప్పిన డైలాగు 1965 లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మొదలయినప్పటి నుండి వింటున్నదే. అరగదీసిన డైలాగు అది.

 

‘తక్షణమే పట్టుకొంటాము’ అని అంటున్నారు, మరి అలా చేయగలిగే కెపాసిటీ ఉంటే ముందే ఎందుకు పట్టుకోలేదని నేనడుగుతున్నాను.’

 

హోం మంత్రి షిండే నిన్న ‘ప్రేలుళ్ళపై విచారణ జరిపిస్తాను’ అన్న డైలాగు ఈ దశాబ్దానికే గొప్ప హై లయిట్ అనదగ్గ డైలాగు.’

 

‘డిల్లీ నుండి స్పెషల్ టీములు విచారణ చేయడానికి రప్పిస్తున్నాం’ అనే మాటకి అర్ధం స్థానిక టీములు వెధవలనా?’ ప్రధానమంత్రి గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారుట. అంటే, ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేయకుండా సంతోషం వ్యక్తం చేస్తారని అనుకొంటామా మనము? మన రాజకీయనాయకులకి కోన వెంకట్ వంటి మంచి డైలాగులు వ్రాసే రచయితలూ అవసరం ఉంది.’

 

‘వీరు (రాజకీయ నాయకులూ)మాట్లాడే మాటలు వినవలసిన వాళ్ళు ఎవరూ వినరు, ఎందుకంటే ఆ వినవలససిన వాళ్ళు బాంబులు పేల్చే ప్రిపరేషన్ లో బిజీ గా ఉంది ఉంటారు. అందువల్ల వారి మాటలు ప్రజలే వినక తప్పట్లేదు.”

 

రచయిత కోన వెంకట్ కూడా రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ మెసేజ్ కు వెంటనే స్పందిస్తూ, వర్మ గారు మీరు చెప్పింది బాగానే ఉంది గానీ, ఈ రాజకీయ నాయకులకు కావలసింది మా వంటి రచయితలూ కారు, దర్శకుల అవసరం ఉంది.” అని జవాబు ఇచ్చారు.