రామ్ చరణ్ పెళ్ళికి తరలి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు
posted on Jun 14, 2012 @ 12:01PM
సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసనల పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని టెంపుల్ ట్రీ ఫామ్హౌస్ ఈ వేడుకకు వేదిక అయ్యింది. ఈ వివాహానికి వచ్చిన అతిథులను కాంగ్రెస్ ఎంపీ, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దగ్గరుండి ఆహ్వానం పలికారు. ఇక వేదిక దగ్గర నాగబాబు, పవన్ కళ్యాణ్, బన్నీల హడావుడి ఎక్కువగా కనిపించింది. ఈ వివాహానికి సినీ నటులు రజనీకాంత్, జూనీయర్ ఎన్టీఆర్, మోహన్‌బాబు, శ్రీదేవి బోనీకపూర్, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్, కోలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు కేంద్ర హోం మంత్రి చిదంబరం, గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తదితరులు వధూవరుల్ని ఆశీర్వదించారు.