ప్రజలకు రిలీఫ్, నాయకులకు టెన్షన్
posted on Jun 14, 2012 @ 11:42AM
ఎలక్షన్లు అయిపోయాయి. ఆయా నియోజకవర్గ ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే నాయకుల వాగ్దానాలు రణగొణధ్వనులు, నాయకులకు ఏర్పాటుచేసే భారీబందోబస్తు ట్రాఫిక్ డైవర్షన్ లాంటివి ఇక మీదట లేనందున ప్రచారాల హోరు ముగిసి రోజువారి పనులకు ఎటువంటి అవాంతరాలు ఉండవని సామాన్య మధ్యతరగతి ప్రజలు సంబరపడుతున్నారు. అయితే నాయకుల పరిస్థితి దీనికి విరుద్ధంగా వుంది. కష్టపడగలిగినంత కష్టపడ్డాం ఫలితాలు ఎలా వుంటాయో అని దిగులుగా వున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరికీ వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం గెలుపువోటములపై అన్ని ప్రధాన పార్టీల నాయకులు టెన్షన్ గా వున్నారు. ఫలితాలను ఎలా స్వాగతించాలా అని అన్ని పార్టీలు సమాలోచనలో ఉన్నాయి. అధికార కాంగ్రెస్ మంత్రులెవరూ సేక్రటరేట్ లో కనిపించడం లేదు. తెలుగుతమ్ముళ్ళ పరిస్థితి అలాగే వుంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకేసులు, వాదప్రతివాదనలతోను సీనియర్ న్యాయవాదుల సంప్రదింపులతో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా 15వ తేదీ వరకు ఈ టెన్షన్ నాయకులకు తప్పదు.