Read more!

వెంట్రుకపై వివరణ ఇచ్చిన రామ్ చరణ్

 

 

 

 

‘నాయక్’ ఆడియో విడుదల వేదికపై మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తేజ మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'రచ్చ' ఆడియో ఫంక్షన్ కు బాబాయ్ పవన్ కళ్యాణ్ రాలేదని ఓ పత్రిక, ఓ ఛానల్ వార్తలు రాసి మా కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు పలు కథనాలు అల్లారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ కు బాబాయ్ వచ్చాడు. నాన్న రాలేకపోయాడు. ఈ వేదిక మీద నాన్న లేని లోటును బాబాయ్ తీర్చాడు. నా తరువాతి ఫంక్షన్ కు బాబాయ్ రాకపోవచ్చు. మా అనుబంధాల గురించి అడ్డగోలుగా రాసే ఆ పేపర్, ఛానల్ వార్తలు నా వెంట్రుకతో సమానం” అని తెరపై చెప్పాల్సిన డైలాగులు స్టేజిపై చెప్పారు.


ఇప్పుడు రామ్ చరణ్ సడన్ గా గేర్ మార్చాడు. తాను చేసిన వ్యాఖ్యలపై మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. ఎవరైతే మాపై ఆ రాతలు రాశారో నేను వాళ్ళను ఉద్దేశించే అన్నాను తప్ప మీడియా మొత్తాన్ని కాదని చెప్పారు. "ఐ లవ్ మీడియా..ఐ రేస్పెక్ట్ మీడియా" రోజు షూటింగ్ లో ఎంత బిజీగా వున్న ఒక గంట మీడియా కు కేటాయిస్తానని చెప్పారు.


రామ్ చరణ్ కు ఉన్నట్లుండి మీడియాపై ఎనలేని ప్రేమ ఎందుకు పొంగుకొంచ్చిందో మరీ..!