రాఖీ గిఫ్ట్‌గా చెల్లెలికి మరుగుదొడ్డి..
posted on Aug 20, 2016 @ 10:38AM
అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది రాఖీ పండుగ. ఆ రోజు సోదరీ, సోదరుడి ఇంటికి వచ్చి రాఖీ కట్టడం..అందుకు బహుమానంగా సోదరుడు బహుమానంగా ఏదైనా ఇవ్వడం ఆనవాయితీ. అయితే, అందరిలా కాకుండా తన సోదరికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమానం ఇవ్వాలనుకున్నాడు ఆ యువకుడు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు చెల్లి ఇంటి వద్ద మరుగుదొడ్డిని కట్టించి బహుమానంగా ఇచ్చాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా రోహిణీ గ్రామానికి చెందిన ప్రేమ్‌చంద్ శర్మ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛ్‌భారత్ కార్యక్రమం ఆకట్టుకుంది. మరుగుదొడ్డి లేక నిత్యం ఇబ్బంది పడుతున్న తన చెల్లెలి కష్టాన్ని చూడలేని ఆ అన్న రాఖీ సందర్భంగా తన చెల్లెలి ఇంటి వద్ద మరుగుదొడ్డిని కట్టించి బహుమతిగా ఇచ్చాడు. ఈమెకే కాకుండా మిగిలిన ఆరుగురు అక్కాచెల్లెళ్లకు కూడా అతి త్వరలో మరుగుదొడ్డు నిర్మించి ఇస్తానని ప్రేమ్‌చంద్ పేర్కొన్నాడు.