రాఖీ సావంత్‌కి పోలయిన ఓట్లు కేవలం 15
posted on May 17, 2014 @ 2:14PM
టీవీల్లో, సినిమాల్లో సెక్స్ బాంబ్‌లాగా చెలరేగిపోయే రాఖీ సావంత్ రాష్ట్రీయ ఆమ్ పార్టీ (రేప్) అనే పార్టీని ప్రారంభించి, దానికి గుర్తుగా మిరపకాయని ఎంచుకుని, ముంబై వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. రాఖీ సావంత్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంది. నియోజకవర్గాన్ని ఒక చుట్టు చుట్టింది. ఇంతకాలం రాఖీ సావంత్‌ని సెక్సీ పోజుల్లో మాత్రమే చూడ్డం అలవాటైన జనం ఒంటినిండా బట్టలు కప్పుకుని ప్రచారంలో పాల్గొనడం చూసి అవాక్కయిపోయారు. రాఖీ సావంత్ కూడా తాను గెలవటం ఖాయమని కలలు కూడా కన్నారు. చివరికి ఆమెకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా.. కేవలం 15 ఓట్లు.. దేశ చరిత్రలోనే ఇంత దారుణంగా ఎవరికీ ఓట్లు వచ్చి వుండవేమో. రాఖీకి 15 ఓట్లు రావడం ఒక అవమానకరమైతే, ఈ 15 ఓట్ల పాయింట్‌ని పుచ్చుకుని సోషల్ మీడియాలో జనం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లన్నీ రాఖీ సావంత్ చదివిందంటే తన పార్టీ గుర్తు అయిన మిరపకాయలు బోలెడన్ని తిని బాల్చీ తన్నేయడం ఖాయం.