Read more!

అమర్ సింగ్ ఆరోగ్యం విషమం

 

 

 

 

సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ దుబాయ్ పర్యటనలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దుబాయ్ విమానాశ్రయంలో సృహ తప్పి కిందపడిపోయారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం స్థిమితంగానే ఉన్నారని వారు వివరించారు.


అమర్‌సింగ్ కొన్నేళ్ల క్రితం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో మూత్రపిండాల సమస్యలకు చికిత్స పొందారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. హెల్త్ చెక్ఆప్ కోసం దుబాయ్ వెళ్ళిన అమర్ స్వదేశానికి తిరిగి వస్తున్న టైంలో ఉన్నట్టుండి అనారోగ్యం కుదిపేసింది.


సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కృత నేతగా గుర్తింపు ఉన్న అమర్ ఆ మధ్య యూపీలో సొంతంగా ఒక పార్టీని ఏర్పరిచారు. అయితే అది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి రిటరవుతున్నానని అమర్ ప్రకటించారు.