రాజ్‌బబ్బర్‌కు రెండేళ్లు జైలు శిక్ష
posted on Jul 8, 2022 @ 1:18PM
బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్‌కు లక్నో కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. 1996 ఎన్నికల సమయంలో పోలింగ్ అధికారి పనికి అడ్డుపడటమే కాక ఆయనపై దాడిచేసిన కేసులో లక్నో కోర్టు శుక్రవారం శిక్షను ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు రూ.8,500 జరిమానా కూడా విధించింది. తీర్పు ప్రకటించే సమయంలో రాజ్ కోర్టులో వున్నారు.
పోలింగ్ అధికారిని డ్యూటీ చేయకుండా అడ్డుకోవడం, దాడి చేయడం అంశాలను బబ్బర్ కూడా అంగీక రించారు. 1996 మేలో ఎన్నికల సమయంలో జరిగిన దాడిపై అప్పటి పోలింగ్ అధికారి లక్నో వజీర్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రాజ్ బబ్బర్ 1990ల్లో రాజకీయా ల్లోకి వచ్చారు. 1994లో సమాజ్‌వాది పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నిక య్యారు. ఆయన హోమ్ మంత్రిత్వ శాఖ, పౌరవిమానయాన శాఖల అనేక కమిటీల్లో ఆయన పాల్గొన్నారు. 1999 ఆగ్రా నియోజకవర్గంలో బిజెపీ అభ్యర్ధి బిఎస్ రావత్ పై లోఆ 10వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2008లో బబ్బర్ కాంగ్రెస్‌లో చేరారు. 2009లో ఎంపీగానూ వున్నారు. కాగా 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
150కిపైగా చిత్రాల్లో, 30 నాటకాల్లోనూ రాజ్ బబ్బర్ నటించారు. సాజీష్, ఆంఖే, దలాల్, ద గాంబ్లర్, అందాజ్, యారానా, బర్సాత్, జిద్ది మొదలైన చిత్రాలు ఆయన నటించిన చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకుంటారు.