కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అశోక్ గెహ్లోట్ నేనా..?
posted on Jan 21, 2021 @ 5:24PM
ఎన్నో ఏళ్ళ నుండి వారసత్వం గా, అధికారికంగా కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కి, వారసుడు కరువయ్యాడా.. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షత పగ్గాలు పట్టనంటున్నాడా.. ? ఇంతకీ రాహుల్ రాజకీయాలకు పనికొస్తాడా.. ? లేదా.. ?
దేశంలో జాతీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ప్రాచీనమైనదనే చెప్పుకోవాలి.. దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలమైన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ.. 1885 నుండి అటు వారసత్వంగా గానీ, ఇటు అధికారికంగా గానీ, తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చింది.. గతంలో సోనియా గాంధీ అధ్యక్షత వహింస్తుండగా.. వివిధ కారణాల వల్ల ఆ పదవిని రాహుల్ గాంధీ కి అప్పగించింది.
రాహుల్ గాంధీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సహంతో పరుగెడుతుందనుకున్న కార్యకర్తల్లో నిరుత్సహమే మిగిలింది.. రాహుల్ నాయకత్వం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. గత ఎన్నికల్లో ఊహించిన ఫలితం రాకపోవడంతో రాహుల్ గాంధీ అధ్యక్షత పదవి కి రాజీనామా చేశారు .. ఆ తరువాత గత కొద్దికాలంగా ఆ పదవి బాధ్యతలు సోనియా గాంధీ నిర్వహిస్తున్నారు.. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న ప్రశ్న అధ్యక్షత పదవి ఎవర్ని వరిస్తుందని.. మరోమారు తిరిగి అధ్యక్షత నిర్వహించడానికి రాహుల్ గాంధీ అయిష్టంగా ఉన్నారు.. ఆ పార్టీ నేతల్లో కూడా అదే తీరు వినిపిస్తుంది.. గతంలో ఇలాంటి ప్రస్తావనే వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ లో గాంధీ కుటుంబానికి దగ్గరి పరిచయం ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పేరు వినిపించింది.. కానీ అందుకు తాను సుముఖంగా లేను అని చెప్పేశారు. అయితే ఇప్పుడు కూడా అధిష్టానం అధ్యక్షత పదవికి అశోక్ గెహ్లోట్ పేరును పార్టీ ముందుకు తీసుకువచ్చింది.. అశోక్ గెహ్లోట్ ను అధిష్టానం ఢిల్లీ కి రమ్మని కబురు పంపింది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ రథసారథి ఎవరో తేలుతుందో లేదో చూడాలి.