సీఎస్‌పై కూతురు లైంగిక దాడి కేసు..
posted on Sep 11, 2016 @ 7:38PM
రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ మీనాపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి..ఆ ఆరోపణలు చేసింది ఎవరో కాదు స్వయంగా ఆయన కూతురు. ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటోన్న ఆయన కూతురు తన తండ్రి ఎలా ప్రవర్తించాడో కోర్టుకు మెయిల్ ద్వారా వెల్లడించింది. మానాన్న నన్ను భారంగా భావించేవాడు..నన్ను అభ్యంతరకరంగా తాకేవాడు. 13 ఏళ్ల వయసులో ఉన్నపుడు నా గదిలోకి వచ్చేవాడు..చెప్పరాని చోటు చేతులు వేసి తాకేవాడు. ఇలా రెండేళ్లపాటు ప్రతి రోజు నరకం అనుభవించాను. చివరకు ఈ విషయాన్ని అమ్మతో చెప్పాను. దాంతో పోలీసులకు చెప్తానని కూడా అమ్మ బెదిరించింది. మగ సంతానం కావాలని అమ్మను విడాకులు అడిగారు. రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందని మొత్తం కుటుంబసభ్యులు వేధించేవారు. నేను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు రాజీ కుదిర్చి ఆయనకు అనుకూలంగా ఉండేలా చేశారే తప్ప న్యాయం చేయలేదని ఆమె ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై ఓం ప్రకాశ్‌ను ప్రశ్నించగా వారు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని చెప్పారు. నా భార్య, కూతురు తనపై చాలా కేసులు పెట్టారని, రెండు కేసుల్లో ఓడిపోయారని అన్నారు. ఐదేళ్లుగా వారు తనకు దూరంగా ఉంటున్నారని అన్నారు.