రాజయ్య గురించి మాట్లాడొద్దు.. పీసీసీ హుకుం
posted on Nov 5, 2015 @ 11:42AM
రాజయ్య కోడలు సారిక అతని ముగ్గురు మనవలు అతిదారుణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇప్పుడు రాజయ్య ఎఫెక్ట్ పార్టీ పై ఎక్కడ పడుతుందా అని కాంగ్రెస్ పార్టీ తెగ భయపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అధిష్టానం ఓ హుకుం జారీ చేసిందట. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో రాజయ్య గురించి కాని.. రాజయ్య కుటుంబలో జరిగిన ఘటన గురించి ప్రస్తావించకూడదని.. ఒకవేళ ఎక్కడైనా అనుకోకుండా అటువంటి సందర్బం వచ్చినప్పుడు రాజయ్యమీద సానుభూతి వ్యక్తమయ్యేలా మాట్లాడొద్దని ఆదేశించారట. అంతేకాదు రాజయ్య మీద సానుభూతి చూపేలా ఒక్క మాట మాట్లాడినా అది వంద ఓట్లకు చేటు తెస్తుందని సూచించారట.
కాగా ఇప్పటికే సారిక మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా సారికని హత్య చేశారనే అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్థానికులు కూడా రాజయ్య కుటుంబంపై ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. రాజయ్య గురించి మాట్లాడితే.. అసలే అంతంత గుర్తింపు ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే కోట్లు కూడా రావని భయంతో ఈ రకమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.