అనేముందు ఆలోచించండి !
posted on Sep 6, 2012 @ 4:15PM
రాజకీయాల్లో ఎప్పుడు తమ పేరు కనపడుతుండాలంటే ఏం చేయాలి..అన్న సందేహం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి వస్తే... వారంతా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రేను అనుసరిస్తే చాలు...! నిత్యం మన గురించి ప్రజలు చెప్పుకునేలా ఎలా చేయాలో బహుశా రాజ్‌ఠాక్రే.. బాల్ ఠాక్రే నుండి స్ఫూర్తి పొందిఉంటారు. అసలు విషయం ఏంటయ్యా అంటే ముంబైలో ఇటీవల జరిగిన అల్లర్లలో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు అతన్ని ఆ రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ముంబై పోలీసులపై చర్యలకు బీహార్ పోలీసులు సంసిద్ధమయ్యారు. దీంతో మహారాష్ట్రలో ఉన్న బీహార్ వాసులను చొరబాటుదారులుగా ముద్రవేసి, ఇక్కడి నుండి వెళ్ళగొడతామని రాజ్ ఠాక్రే హెచ్చరించడం అక్కడ పెనుదుమారానికి కారణమయింది. ఇటువంటి నేతల మాటలు,లోపాయికారిగా చేసే చేష్టలు... ‘మేం తాంబూలాలు ఇచ్చేసాం. ఇక మీ ఇష్టం...’ అనేట్లుగా వుంటాయి. ఆ తర్వాత మీ దయ... మా ప్రాప్తం!