వర్షం ఆడిన క్రికెట్ మ్యాచ్
posted on Oct 29, 2022 @ 10:34AM
వర్షం రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు. కానీ వర్షా కాలంలోనే తెలిసి క్రికెట్ మ్యచ్ లు , ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలు నిర్వహించడంలో అర్ధం లేదు. మరి అన్నింటా తెలివిగా ఉంటామనే ఇంగ్లీష్ వారు వర్షాలు బాగా పడే సమయంలోనే ఏకంగా ప్రపంచకప్ నిర్వహించడం మాత్రం ప్రపంచ క్రికెట్ వీరాభిమానులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అవును చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అద్భత ప్రదర్శనలను చూడాలన్న ఉత్పాహం నీరుగర్చారనే అనాలి.
వర్షం మామూలు సమయంలో బాగానే అనిపిస్తుంది. తడిసి గెంతులేయాలనే అనిపిస్తుంది. కానీ మంచి క్రికెట్ మ్యాచ్ అందునా భారత్, పాకిస్తాన్ లేదా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ ల సమయంలో వస్తే మాత్రం క్రికెట్ వీరాభిమానులకు పిచ్చెక్కుతుంది. ఎంతో ఆశతో చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న మ్యాచ్ లు వర్షం కారణంగా జరగకపోయినా, సగం జరిగి ఆగిపోయినా మ్యాచ్ మజా పోతుంది. టికెట్ అతికష్టం మీద సంపాదించి తన వీరాభిమాన హీరోల ఆటను ప్రత్యక్షంగా చూడటంలో ఉండే థ్రిల్ వేరబ్బా అంటారు క్రికెట్ పిచ్చాళ్లు. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ, మాక్స్ వెల్ లాంటి సూపర్ హిటర్ల ఆటతీరు దగ్గరుండి చూడటం, దాన్ని స్నేహితులకు వివరిస్తూ చెప్పడంలో అదో మజా. కానీ వర్షం వస్తే మాత్రం మొత్తం గల్లంతే.. అంతటి ఉత్సాహం వర్షార్పణమే అవుతుంది.
క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లు సిద్ధంగా ఉంటే సరిపోదు. వాతావరణం కూడా అనుకూలించాలి. వర్షం పడినా, ఎండ ఎక్కువైనా సరే మ్యాచ్ ఆడటం కష్టమవుతుంది. ఎండైతే ఎలాగోలా మేనేజ్ చేసి ఆడేయొచ్చు. కానీ వర్షం పడితే మాత్రం ఒక్క బంతి కూడా పడదు. ఫీల్డింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. వర్షం వల్ల క్రికెట్ మ్యాచ్ లకు ఇబ్బంది ఎప్పుడూ ఉండేదే. కానీ టీ20 వరల్డ్ కప్ లాంటివి నిర్వహించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా జరుగుతున్న టోర్నీనే చూస్తుంటే ఐసీసీని తిట్టాలి అనిపించేంత కోపం వస్తోంది. ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో 2019 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా కొన్ని మ్యాచులకు ఇలా వర్షం అడ్డంకిగా నిలిచింది.
2020 జనవరి నెలలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టి20 సిరీస్ వర్షం ప్రభావాన్ని తెలియజేసే గొప్ప సందర్భం. అస్సాం రాజధాని గువహటి లో మ్యాచ్ అనగానే సగటు భారత క్రికెట్ అభిమానికి ఠక్కున గుర్తొచ్చేవి ఇస్ట్రీ పెట్టెలు, హెయిర్ డ్రయర్లు. అంతలా గువహటిలోని బర్సపార క్రికెట్ స్టేడియం పేరు గాంచింది. అందులో భాగంగా తొలి టి20 గువహటి లోని బర్సపార స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే మ్యాచ్ కు కొన్ని గంటల ముందు గువహటిలో భారీ వర్షం కురిసింది. ఇక మ్యాచ్ సమయాని కైతే వర్షం మాత్రం ఆగిపో యింది. వర్షం కురిసే సమయంలో గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను సరిగ్గా కప్ప లేదేమో.. లేదా రంధ్రాలున్న కవర్లతో పిచ్ భాగాన్ని కప్పారేమో తెలీదు కానీ.. వర్షానికి పిచ్ తడిసి పోయింది. వర్షం తగ్గినా.. అవుట్ ఫీల్డ్ బాగున్నా.. పిచ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఎవరి ఐడియానో కానీ.. గ్రౌండ్ సిబ్బంది పిచ్ మీదకు ఐరన్ బాక్స్ లను, హెయిర్ డ్రయర్లతో వచ్చేశారు. వాటితో పిచ్ ను ఆరబెట్టే ప్రయత్నం చేశారు.
టీ20 ప్రపంచకప్ 2022లో వర్షం హవా కొనసాగుతోంది ఇంగ్లండ్‌లో వాతావరణం అనూహ్యంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే, అయితే అనేక మ్యాచ్‌లు రద్దు కావడం మెగా ఈవెంట్‌ను ప్లాన్ చేయడంపై ప్రశ్నలను లేవ నెత్తింది. మొన్న ఒక్క రోజే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయ్యాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు మ్యాచ్‌లు వర్షానికి బల య్యాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం జరగాల్సిన అఫ్గాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలి యా- ఇంగ్లండ్ మ్యాచ్‌లు రద్దవ్వడం వెనుక క్రికెట్ ఆస్ట్రేలియా కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వర్షం వల్ల దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ని 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 79 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా గెలిచేస్తుంది అని టైంకి మళ్లీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ ని రద్దు చేశారు. బుధవారం కూడా సేమ్ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇంగ్లాండ్-ఐర్లాండ్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ టైంలో వర్షం పడింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ జట్టుని విజేతగా ప్రకటించారు. దీని తర్వాత జరగా ల్సిన ఆఫ్ఘానిస్ధాన్-న్యూజిలాండ్ మ్యాచ్ అయితే.. కనీసం టాస్ పడకుండానే రద్దయింది. రెండు జట్లకు చెరో పాయిం ట్ ఇచ్చేశారు. జస్ట్ రోజుల వ్యవధిలోనే మూడు మ్యాచ్ లు వర్షానికి ఎఫెక్ట్ అయితే.. ఇక రాబోయే మ్యాచ్ ల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. వర్షకాలంలో వరల్డ్ కప్ ఏంటి.. ఐసీసీకి ఆ మాత్రం తెలివి లేదా అని నెటిజన్స్ ఏకిపారేస్తున్నా రు. అలానే దీన్ని వర్షాల వరల్డ్ కప్ అని విమర్శిస్తున్నారు. మరి ఈసారి వరల్డ్ కప్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి
ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా గ్రూప్ 1లో జరగాల్సిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. ముందు పెద్దగా అడ్డంకి కాదనే అను కున్నారు. కానీ గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ బాగా ముద్దగా మారడంతో మ్యాచ్ రద్దుచేయకా తప్పలేదు. మధ్యా న్నం టాస్ కి కూడా జాప్యం అయింది. అప్పటికి వర్షం కొంత తెరిపిచ్చింది. కొంతసమయం తర్వాత ఆట ప్రారంభించవచ్చని అనుకున్నారు. కానీ అందుకు అవకాశం లేకుండా పోయింది. మ్యాచ్ ఈ విధంగా రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్ 1లో ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో స్థానంలో, ఆసీస్ నాలుగో స్థానంలో ఉన్నాయి.