రైల్వే బడ్జెట్ కు ఇక మంగళం..
posted on Aug 13, 2016 @ 10:46AM
ప్రతి ఏటా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతుందన్నసంగతి తెలిసిందే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ సంపద్రాయానికి మోడీ ప్రభుత్వం మంగళం పాడనుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అంతా ఒకే బడ్జెట్ (సాధారణ)గా ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు అప్పుడే మొదలుపెట్టారు కూడా. అంతేకాదు ప్రణాళిక సంఘం- నీతి ఆయోగ్ సభ్యులు బిబేక్ దేబరాయ్, కిషోర్ దేశాయ్ లు రైల్వే బడ్జెట్‌ను ఆర్థిక బడ్జెట్‌లో విలీనం చేసే విషయంలో అప్పుడే ఓ నివేదికను కూడా మోడీకి సమర్పించారట. ఇక అన్నీ కుదిరితే సాధారణ (ఆర్థిక) రైల్వే బడ్జెట్ అంటూ ప్రత్యేకించి ఉండదు.
కాగా ఈ విధానం ఎప్పటి నుండో అమలులో ఉన్న సంగతి విదితమే..అయితే ఈ విధానం వల్ల ఆయా రాష్ట్రాలకు చెందిన మంత్రులు తమ రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులు, అధిక నిధులు కేటాయించుకోవడం, ఇతర రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయడం కనిపిస్తుండటంతో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.