రాహుల్ కిసాన్ యాత్ర.. అప్పు తెచ్చి మరీ విందు..
posted on Sep 16, 2016 @ 12:19PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ మహాయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటిలో భోజనం చేశారు. అయితే అందులో ఆశ్చర్యం ఏముంది.. రాహుల్ గాంధీ అప్పుడప్పుడు అలా చేస్తుంటారు కదా అనుకుంటున్నారా..? అయితే ఇక్కడే ఉండే ట్విస్ట్.. రాహుల్ గాంధీకి భోజనం ఏర్పాటు చేయడానికి సదరు కుటుంబం నానా పాట్లు పడాల్సివచ్చిందంట. ఎందుకంటే ఆ కుటుంబం అంత పేదరికంలో ఉంది. అసలు సంగతేంటంటే.. రాహుల్ గాంధీ వెళ్లిన ఇల్లు నిరుపేద కుటుంబం.. అతనికి భోజనం ఏర్పాటు చేయడానికి వాళ్లు చుట్టుపక్కల ఇళ్ల దగ్గర నుండి కూరగాయలు... రొట్టెలు చేయడానికి పిండి తెచ్చి మరీ విందు ఏర్పాటు చేశారట. ఇంకా వారు మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ తమకు దేవుడులాంటివారని, అందుకే మంచి ఆతిథ్యం ఇవ్వాలని భావించామని, ఇందులో తప్పేముందని, అప్పుని తర్వాత తీర్చుతామని అన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇదో వివాదమై కూర్చుంది. రాజకీయ నాయకులు ప్రచారం కోసం పేదలను ఉపయోగించుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, సమాజంలో నెలకొన్న దారిద్య్రాన్ని పారదోలడానికి కృషి చేయాలని పలువురు వాదిస్తున్నారు. మరి అంత కష్టాల్లో ఉన్నా కానీ వారు విందు చేర్పాటుచేశారు.. మరి అలాంటి వారికి సహాయం చేయడానికి రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం...