రాహుల్ గాంధీ పెళ్లి ఫిక్స్..?
posted on Jul 6, 2016 @ 11:52AM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్నాడా..తన బ్రహ్మచర్యానికి స్వస్తి పలికి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే మోస్ట్ వాంటెట్ బ్యాచులర్ గా ఉన్న రాహుల్ గాంధీ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ ఇదే. ఇప్పటికే 46 ఏళ్ల సంవత్సరాలు వయసున్న రాహుల్ గాంధీ.. తన తల్లి సోనియా గాంధీ చూసిన అమ్మాయితోనే వివాహానికి సిద్దమైనట్టు సమాచారం. అలహాబాద్ లోని ఓ కుటుంబంతో సోనియా ఈ మధ్య చర్చలు కూడా జరిపారట. ఆ ఫ్యామిలీలోని ఓ బ్రాహ్మణ యువతితో రాహుల్ పెళ్లి చేయాలని సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అది కూడా వచ్చే యూపీ ఎన్నికలు జరిగే నాటికే రాహుల్ కు పెళ్లి చేయాలని సోనియా గాంధీ చూస్తున్నారట. అయితే దీని వెనుక నాడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శిగా వ్యవహరించిన వ్యక్తి ఉన్నాడట. ఈయనే సోనియాకు ఆ కుటుంబం గురించి చెప్పి... సంబంధం కుదిర్చాడట. మొత్తానికి ఎన్నో ఏళ్లకి రాహుల్ ఓ ఇంటివాడవ్వటం శుభపరిణామమే అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరి అది ఎంత వరకూ నిజమే తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.