నాయకా, ఇది తగునా..నిలదీసిన రఘురామ
posted on Oct 13, 2022 @ 10:28PM
జగన్ ప్రభుత్వానికి రోజు రోజుకీ గండాలు గడుస్తున్న లెక్కవేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ రెబెల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు తీవ్ర స్థాయిలో తమ పార్టీ నాయకుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీద మరోసారి విరుచుకుపడ్డారు. అందరం కలిసికట్టుగా రాజీనామా చేసి మూడురాజధానుల ఎజెండాతో ఎన్నికలకు వెళదామని సూచించారు. లోక్ సభ ఎంపీలతో పాటు, రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేయడమే కాకుండా, 151 మంది ఎమ్మెల్యేలు కూడా తమ శాసన సభ్యత్వానికి రాజీ నా మా చేసి ఎన్నికలకు వెళ్తే, మూడు రాజధానుల ఏర్పాటు పై ప్రజలు తమ నిర్ణయాన్ని ఓటు హక్కు ద్వారా తెలియజేస్తార న్నా రు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజ ధాని అమరావతికి మద్దతుగా మాట్లాడి, ఇప్పుడు వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యా స్పదంగా ఉందని విమర్శించారు. మూడు రాజధానుల ఎజెండాతో తాజాగా ఎన్నికలకు వెళ్లి, మళ్లీ నెగ్గితే, రాష్ట్ర పునర్వి భజన చట్టాన్ని మార్చాలని పార్లమెంటును అడుగుదామని అన్నారు. అయినా చట్ట సవరణ జరిగే అవకాశమే లేదన్నారు.
ఎన్నికలకు ముందు రాజధాని అమరావతి కి మద్దతుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారా యణలు మాట్లాడిన వీడియో క్లిప్పింగులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అమరావతిని బ్రహ్మాండంగా నిర్మిస్తామని జగన్మో హన్ రెడ్డి ప్రజలకు హామీ ఇవ్వగా, కబ్జాదారులు మాత్రమే రాజధాని మార్పును కోరుకుంటారని సత్తిబాబు గతంలోనే జ్యోతిష్యం చెప్పారన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి యేనన్న ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి గెలిచామని, ఇప్పుడు వికేంద్రీకరణ ఎజెండాతో ఎన్నికలకు వెళితే ప్రజలు 175కు 175 స్థానాలలో గెలిపిస్తారేమో చూద్దామంటూ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
అత్త మీది కోపం దుత్త మీద తీసినట్లుగా సాక్షి దినపత్రిక పైనున్న అక్కసును తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ సాయి రెడ్డి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పై తీసినట్లుగా ఉన్నదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. విశాఖ భూ కుంభకోణం పై వెల్లువెత్తు తున్న విమర్శలకు సాక్షి దినపత్రికలో ఎక్కడా ఖండన కనిపించకపోవడంతో, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీ రావును ఏక వచనంతో సంబోధిస్తూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత కొంతకాలం నుంచి వార్తా దినపత్రిక, టీవీ ఛానల్ ను ప్రారంభించాలనుకుంటున్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు రామోజీరావు పై ఆగ్రహంతోనే వార్తా దినపత్రిక, టీవీ ఛానల్ ను ప్రారంభించనున్నట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
విజయసాయిరెడ్డి ప్రారంభించనున్న పత్రిక, చానెల్ కు సాక్షి దినపత్రికకు ఇచ్చిన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తుందని అనుకో వడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. సాక్షి దినపత్రిక, చానెల్ లో విజయసాయి రెడ్డికి ఇతర పత్రికలు ఇచ్చినంత ప్రాధా న్యత కూడా ఇవ్వడం లేదని చెప్పారు. విశాఖ భూముల వ్యవహారంలో ఏ 1 కు తెలియకుండా, ఎ2 కొట్టేశారా? అన్న అనుమా నం ఏ 1 కు వచ్చినట్లుందని ప్రజలు అనుమానిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పత్రిక, టీవీ ఛానల్ 10 రూపాయల షేర్లను 300 నుంచి 400 రూపాయలకు విక్రయించి, ఆ సొమ్మును రాబట్టగలరని ఎద్దేవా చేశారు. పత్రిక, టీవీ ఛానల్ రంగంలోకి అడుగుతున్న విజయ సాయి రెడ్డికి రఘురామకృష్ణంరాజు అభినందనలు తెలియజేస్తూ, మిగతా పత్రికలు ఛానల్ విలేకరుల మాదిరిగానే రచ్చబండ కార్యక్రమానికి నీతి టీవీ, నిజాయితీ దినపత్రిక విలేకరులు హాజరు కావచ్చునని ఆహ్వానం పలికారు.
లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభించిన అదాన్ డిస్టలరీ కంపెనీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారి సహకారం లేకుండానే రెండు మూడు వేల కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి చేరుకుందా? అని రఘురామ ప్రశ్నించారు. మద్యం వ్యాపారంలో ప్రముఖ కంపెనీలకు లేని టర్నోవర్ విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి ఎందుకు చేరుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రముఖ మద్యం కంపెనీలను కాదని, విజయసాయి అల్లుడు కంపెనీకి అంత వ్యాపారం వచ్చేసిందంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించారు. తల్లి కూతురు, 104, 108 అంబులెన్స్ లతో పాటు, పోర్టు, సారా వ్యాపారం, నామినల్ ధరకే స్థలాల కొనుగోలు, అన్నీ వారికేనని అన్నారు.
ప్రజా ఆస్తి హక్కు పై ముఖ్యమంత్రి ఫోటో ముద్రణ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని ఇదే విషయాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ కు దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఒక లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారితోపాటు, భూ రెవెన్యూ చీఫ్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఈ వ్యవహారం పై వారం రోజులు వేచి చూస్తానని, లేకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు.. భూ యజమానుల ఇండ్లలో శాశ్వ తంగా ఉండే ఆస్తిపత్రాలపై పార్టీ రంగులతో ఒక వ్యక్తి ఫోటో ముద్రించడం ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు.
ప్రజా ఆస్తి హక్కు పత్రాలను పొందడానికి, భూ యజమానులు ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నంబర్ ను ఇవ్వాలని కోరడం కూడా నిబంధనలకు విరుద్ధమే నని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలని, ప్రజా ఆస్తి హక్కు పత్రాలపై పార్టీ రంగులతో ఒక వ్యక్తి ఫోటో ముద్రించడం, ఈ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.