ఆర్. కృష్ణయ్యకు ఆ విషయం తెలియదా!
posted on Feb 1, 2016 @ 4:26PM
తుని సంఘటన మీద బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చాలా చిరాకుపడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాపులను బి.సిలలో చేర్చితే మిగతా బి.సి.లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అందుకని వారి డిమాండ్‌కి తల ఒగ్గద్దనీ ఆయన చంద్రబాబు నాయుడుని హెచ్చరిస్తున్నారు కృష్ణయ్య. మరి తెలుగుదేశం, కాపులను బి.సిలలోకి చేర్చేందుకు కృషి చేస్తామని తన మ్యానిఫెస్టోలో చెప్పింది కదా! అదే మ్యానిఫెస్టోతో అందరూ ఎన్నికలకి దిగారు కదా! ఆ రోజున కిమ్మనకుండా ఉన్న కృష్ణయ్యగారు ఈ రోజున ఎందుకు కోపగించుకుంటున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. కృష్ణయ్యగారు తెదెపా తరఫు నుంచి ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో పోటీ చేసి ప్రస్తుత తెలంగాణ శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన మొదటి నుంచీ కాపులని బి.సి.లలోకి చేర్చేకూడదంటూ తన నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉండేవారు. కాకపోతే ఎన్నికల సమయంలో కాస్త శాంతించి ఉంటారంతే.