నా కొడుకును కాల్చి చంపేయండి.. పాకిస్థాన్ మోడల్ తండ్రి..
posted on Jul 22, 2016 @ 4:49PM
పాకిస్థాన్ మోడల్ ఖండీల్ బలోచ్ ను తన సోదరుడు అత్యంత దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. తమ కుటుంబ పరువు తీస్తుందని.. ఎన్నోసార్లు చెప్పి చూశాను.. కానీ వినలేదు అందుకే చంపేశానని..దీనికి నేను ఏం మాత్రం బాధపడట్లేదు.. అని పోలీసుల ముందు అసలు ఎలాంటి బిడియం లేకుండా చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఖండీల్ బలోచ్ హత్యపై స్పందించిన ఆమె తండ్రి.. తన కుమారుడు కనిపిస్తే కాల్చి చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఘటన జరిగిన రోజు తాము ఇంటి పై అంతస్థులో ఉన్నామని, తమకు డ్రగ్స్ ఇవ్వడం వల్ల స్పృహ లేకుండా పడుకున్నామని.. బలోచ్ ను గొంతు నులిమి చంపాడని.. అతన్ని కాల్చి చంపాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఆమె తల్లి మాట్లాడుతూ.. బలోచ్ నాకు అన్ని విషయాలు చెప్పేది.. తాగే పాలలో తన కొడుకు మత్తు మందు కలపడంతో ఉదయం వరకూ లేవలేదని.. ఉదయం బలోచ్ ను లేపడానికి వెళ్లితే తాను లేవలేదని.. తన ముఖం మొత్తం కమిలిపోయింది.. నాలుక, పెదవులు నల్లగా అయిపోయి ఉన్నాయని తెలిపారు. తమ కొడుకును మాత్రం క్షమించేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు.