చిరంజీవిగారు... మా సంసారంలో నిప్పులు పోయవద్దు! పీవీపీ ట్వీట్
posted on Apr 24, 2020 @ 12:55PM
ఇంట్లోని మహిళలతో ఇంటి పనులు చేయించకండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగా మగవారికి ‘బీ ద రియల్ మేన్’ అనే ఛాలెంజ్‌కు స్పందన బాగా వస్తుంది.
ఈ ఛాలెంజ్ ను సెలబ్రిటీలందరూ స్వీకరిస్తూ.. ఇంటిపనులు చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి వావ్.. అనే రేంజ్‌లో చేసి చూపించారు. ఈ వీడియోలో చిరు దోశ వేసిన తీరు ఔరా అనిపించేలా ఉంది. ఇప్పుడిదే వీడియోపై నిర్మాత పీవీపీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలా చేసి మా సంసారంలో నిప్పులు పోయవద్దు అంటూ పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
‘‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. అంటూ పీవీపీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు.
'బీ ద రియల్ మేన్' కు టాలీవుడ్ నటుల స్పందన
ఇంట్లోని మహిళలతో ఇంటి పనులు చేయించకండి అంటూ మొదలైన ఈ ఆన్ లైన్ చాలెంజ్ లో రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేశ్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. మరికొందరు సినీ స్టార్స్, రాజకీయ నాయకులకు దాన్ని పాస్ చేశారు.