సచిన్ చేతుల మీదుగా సింధూకు BMW కారు..
posted on Aug 24, 2016 @ 3:12PM
రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన సింధూకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రశంసలు అందిచారు. ప్రశంసలతో పాటు ఆమెకు అదే రేంజ్లో నజరానాలు కూడా అందుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రా ప్రభుత్వాలు ఇప్పటికే సింధూకు తగిన విధంగా రివార్డులు అందించాయి. ఇప్పుడు ఆ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ కూడా చేరిపోయాడు. సింధూకు BMW కారు బహుమతి గా ఇవ్వనున్నాడు. 60 లక్షల విలువ గల ఈ కారును పి.వి.సింధూ కు సచిన్ చేతులమీదుగా బహుకరించానున్నారు. ఈ కారును హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వి చాముండేశ్వర్ నాథ్, ఆయన స్నేహితులు కలిసి స్పాన్సర్ చేశారు. సచిన్ చాముండికి ఆప్త మిత్రుడు. సచిన్ చేతుల మీదుగా సింధూకు దీన్ని అందచేయాలని అసోసియేషన్ తరఫున నిర్ణయించారు. దీంతో సచిన్ సింధూకు ఈ నెల 28 వ తేదిన కారును బహుకరించానున్నారు.
కాగా రియో స్టార్ సింధూకు ఏపీ ప్రభుత్వం 3 కోట్లు, రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఇక పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు, వెయ్యి గజాల స్థలం ప్రకటించింది. ఇంకా ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్లు ప్రకటించింది. ఇంకా పలు సంస్థలు సింధూకు భారీగానే నజరానా ప్రకటించాయి.