బాబా పరిస్థితి విషమమే
posted on Apr 20, 2011 9:19AM
అనంతపురం: పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా బులిటెన్ విడుదల చేశారు. ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. అలాగే సత్యసాయి బాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ బాబా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. సత్యసాయి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బీపీ నార్మల్‌గా ఉందని, అన్నీ అవయవాలు బాగా పనిచేస్తున్నాయని, సీఆర్ఆర్‌టీ సిస్టమ్‌లో వైద్యం అందిస్తున్నామని వైద్యులు పి.వి. రమేష్ చెప్పారు. కానీ బాబా ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతూనే ఉందని రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా వెంటిలేటర్ పైనే శ్వాస అందిస్తున్నామని కాలేయం పని తీరు మెరుగు పడిందని మళ్లీ తరువాతి రోజే కాలేయం పనితీరు నెమ్మదిగా ఉందని చెబుతూ భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నారు. అవయవాలు సరిగా పని చేస్తున్నాయని చెప్పి తాజాగా అవయవాల పనితీరు మందగించిందని పొంతన లేని మాటలు చెపుతున్నారు. ఇదిలా ఉంటే బాబా త్వరలో కోలుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.