వైభవంగా జగన్నాథ రథయాత్ర
posted on Jun 30, 2014 @ 5:33PM
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర భక్తుల కోలాహలం మధ్య ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు జగన్నాథుని రథాన్ని తాకి పులకరించిపోయారు. ఆదివారం ఉదయాన్నే ఒరిస్సా తీరప్రాంత నగరం పూరీకి భక్తులు లక్షలాదిగా చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అత్యంత ఆకర్షణీయంగా అలంకరించబడిన రథంపై జగన్నాథునితోపాటు సోదరుడు బాలభద్రుడు, సోదరి సుభద్రల విగ్రహాలను ఉంచి పూరీ పురవీధుల్లో ఊరేగించారు. రథం ఊరేగుతున్న మార్గం పొడవునా భక్తులు హారతులతో తమ ఇష్టదైవాలకు స్వాగతం పలికారు. రథయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఏర్పాట్లలో వైమానిక, నావికా దళానికి చెందిన 6,520 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సముద్ర తీరం వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగా, ఆకాశంలో ఏవియేషన్ అధికారులు నిఘా వేసి వుంచారు. వీరితోపాటు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, షార్ప్ షూటర్లు కూడా రంగంలోకి దిగారు.