Read more!

పురందేశ్వరి ఫై షర్మిలా పోటీ ?

 

 

వచ్చే ఎన్నికల్లో ఎన్ టి ఆర్ కుమార్తె, కేంద్ర మంత్రి పురందేశ్వరి ఫై పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జగన్ సోదరి షర్మిలా బలంగా భావిస్తోన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కడప నుండి పోటీ చేయాలని షర్మిలా భావించినప్పటికీ, ఆ స్థానం నుండి అవినాష్ రెడ్డిని పోటీకి దింపాలని జగన్ మోహన్ రెడ్డి దాదాపు తుది నిర్ణయం తీసుకోవడంతో షర్మిలా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం విశాఖపట్నం నుండి మంత్రి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె తిరిగి ఇక్కడ నుండే పోటీకి దిగే పక్షంలో ఆమెఫై పోటీకి దిగాలని షర్మిలా భావించారు. అయితే, అక్కడ నుండి పోటీ చేయాలని టి.సుబ్బరామి రెడ్డి కూడా పార్టీ అధిష్టానంఫై వత్తిడి తెస్తుండడంతో పురందేశ్వరి స్థానం ఒంగోలుకు మారే అవకాశం ఉంది.


ఒక వేళ పురందేశ్వరి ఒంగోలు నుండి పోటీ చేయడం ఖరారు అయితే, షర్మిలా కూడా తన స్థానాన్ని ఒంగోలుకే మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుండి ఈ ఇద్దరు మహిళా నేతలు పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోం
ది.