పురంధరేశ్వరికి చంద్రబాబుపై కోపం పోయిందా..?
posted on Jan 28, 2016 @ 4:14PM
బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి.. చంద్రబాబుకి మధ్య ఉన్న బేధాభిప్రాయల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజేపీ-టీడీపీ మిత్రపక్షాలు అయినప్పటికీ.. బీజేపీ పార్టీ నుండి టీడీపీ నేతలను కాని.. ఆఖరికి పార్టీ అధినేత చంద్రబాబును కాని విమర్శించడంలో పురంధరేశ్వరీ ఎప్పుడూ ముందుంటారు. అయితే గత కొద్ది రోజుల నుండి మాత్రం పరిస్థితి మారింది. ఎప్పుడూ చంద్రబాబు మీద విరుచుకుపడే పురంధరేశ్వరీ ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు. అంతేకాదు ప్రస్తుతం గ్రేటర్లు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో జోరుమీదుండగా.. బీజేపీకి టీడీపీ పార్టీల తరుపున ఆమె ప్రచారానికి దిగారు. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పురంధరేశ్వరీకి చంద్రబాబు మీద ఉన్న కోపం పోయిందా అని మాట్లాడుకునే వారు కూడా ఉన్నారు.
కాగా ప్రచారంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధి విషయం దగ్గరికి వచ్చే సరికి టి ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటలతోనే సరిపెడుతున్నారని.. అభివృద్ధి మాత్రం జరగడం లేదని ఆమె వాపోయారు. అభివృద్ధి ఎవరు చేశారో చూసి ఓటెయ్యాలని ఆమె కోరారు.
ఇదిలా ఉండగా పురంధరేశ్వరీ చంద్రబాబు విషయంలో ఏమనకుండా ఉండటానికి గల కారణం రాజ్యసభ సీటు కోసమే అని కూడా గుసగుసలాడుకుంటున్నారు. మరి ఏది నిజమో ఆమెకే తెలియాలి.