బ్యాంకింగ్ చరిత్రలోనే భారీ నష్టాన్ని చవిచూసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు
posted on May 18, 2016 @ 5:32PM
పంజాబ్ నేషనల్ బ్యాంకు కు వచ్చిన నష్టం చూస్తుంటే బ్యాంకింగు చరిత్రలోనే అతి పెద్ద నష్టం ఇదేనేమో అనిపిస్తోంది. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 5 వేల కోట్లకు పైగానే నష్టాన్ని చవిచూసింది. 2016 మార్చిలో నాలుగో త్రైమాసిన పూర్తవగా మొత్తం రూ. 5,367.14 కోట్లు నష్టంలో ఉన్నట్టు ప్రకటించింది. కాగా గత సంవత్సరం ఇదే సమయానికి బ్యాంకు దాదాపు రూ. 306 కోట్ల లాభాంలో ఉండగా.. ఒక్క ఏడాదికే ఇంత భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మొత్తానికి పెరుగుతున్న రుణ బకాయిల దెబ్బ ఎలా ఉంటుందో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి తెలిసొచ్చింది.
కాగా, ఈ మూడు నెలల కాలంలో మొత్తం ఆదాయం 1.33 శాతం తగ్గి రూ. 13,276 కోట్లకు చేరిందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 2014-15 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే నిరర్థక ఆస్తుల మొత్తం 3 రెట్లు పెరిగి రూ. 3,834 కోట్ల నుంచి రూ. 10,485 కోట్లకు పెరిగిందని బ్యాంకు తెలిపింది.