బర్రెలక్కకు గన్ మెన్ ... ఈసీకి హైకోర్టు ఆదేశం
posted on Nov 25, 2023 @ 11:44AM
తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని బర్రెలక్క హైకోర్టులో వేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. 2ప్లస్ 2భద్రత కోరిన బర్రెలక్కకు ఒక గన్ మెన్ ని ఏర్పాటు చేయాలని ఈసీ, పోలీసులను ఆదేశించింది. స్వతంత్ర్య అభ్యర్దిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు ఎన్నికలు ముగిసే వరకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే అంటూ తీర్పిచ్చింది.
తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని బర్రెలక్క హైకోర్టులో వేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. స్వతంత్ర్య అభ్యర్దిగా పోటీ చేస్తున్న బర్రెలక్క ఎన్నికలు ముగిసే వరకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే అంటూ తీర్పిచ్చింది.
అలాగే బర్రెలక్క పబ్లిక్ మీటింగ్ లకు కూడా భద్రత కల్పించాలని కోర్టు తెలిపింది. ఆమెతో పాటు ఆమె కుటుంబానికి భద్రత కల్పించే అంశంపై ఈసీ, డీజీపీ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
అలాగే గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత కల్పిస్తే సరిపోదని..భద్రత కోరిన ప్రతి అభ్యర్ధికి సెక్యురిటీ కల్పించాల్సిన బాధ్యత ఈసీకి ఉందని కోర్టు గుర్తు చేసింది.తనిఖీల పేరుతో కార్లు చెక్ చేస్తే సరిపోదని న్యాయస్థానం అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా పాపులర్ అయిన కర్నె శిరీష కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తోంది.సామాన్యుడికి సైతం ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అర్హత ఉంటుందని నిరూపించింది బర్రెలక్క. నిరుద్యోగుల గొంతుకగా కొల్లాపూర్ నుంచి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన బర్రెలక్కపై దాడి జరిగింది.సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ తో పాటు దాడి తర్వాత ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో స్వతంత్ర్య అభ్యర్ధిగా ఉన్న కర్నె శిరీష పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతే ఫాలోయింగ్ పెరిగింది.హంగూ ఆర్బాటం లేకుండా నామినేషన్ వేసిన బర్రెలక్కకు ఊహించని విధంగా ప్రజల్లో స్పందన వచ్చింది. దీంతో ఆమె ప్రత్యర్ధుల నుంచి బెదిరింపులు, దాడులు ఎదుర్కోవల్సి వచ్చింది. ఈక్రమంలోనే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.ఎవరెంత బెదిరించినా , ఎంత ప్రలోభపెట్టినా తాను పోటీ నుంచి వైదొలగనని బరిలో ఉంటానని స్పష్టంగా చెబుతోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బర్రెలక్కకు న్యాయస్థానం ఆదేశంతో ఇక నుంచి సెక్యురిటీ కల్పించనున్నారు పోలీసులు.బర్రెలక్క నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామవాసి. దళిత,నిరుపేద కుటుంబానికి చెందిన బర్రెలక్కకు సోషల్ మీడియా మంచి గుర్తింపు ఉంది.ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూనే కుటుంబానికి ఆసరగా ఉండేందుకు శిరీష కూడా కూలీ పనులకు కూడా వెళ్లేది. తల్లిని అడిగి నాలుగు బర్రెలను కొని, వాటి పాలు అమ్ముతూ డబ్బు జీవనం సాగించింది. అయితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలన్న ఉద్దేశ్యంతో బర్రెలను అమ్మేసింది. ప్రస్తుతం టిఫిన్ సెంటర్ నడుపుతోంది. తనలాంటి నిరుద్యోగుల ఆవేదనను జనాలందరికీ తెలిసేలా ఓ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇన్ స్టాలో సంచలనం సృష్టించింది. దేశవిదేశాల్లోని ఇన్ స్టా యూజర్లకు ఆమె పరిచయం అయ్యింది. అప్పటినుంచి కర్నె శిరీషను బర్రెలక్కగా మారిపోయింది.నిరుద్యోగులకు న్యాయం చేయడానికి చట్ట సభలో వెళ్లాలని డిసైడ్ అయి ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఈల గుర్తుపై పోటీ చేస్తోంది. కొల్ఫాపూర్లో ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సైతం బర్రెలక్కకు వస్తున్న ప్రచారం చూసి గుబులు రేకెత్తిస్తుంది. ప్రస్తుతం శిరీషకు ఇన్ స్టాలో 5.73 లక్షల మంది, ఫేస్ బుక్ లో 1.07 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో 1.59 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.