ప్రముఖ రచయిత్రి కే.రామలక్ష్మి ఇక లేరు
posted on Mar 4, 2023 6:00AM
ప్రముఖ రచయిత్రి, కె.రామలక్ష్మి కన్నుమూశారు. సుప్రసిద్ధ కవి అరుద్ర సతీమణి కే.రామలక్ష్మి గత కొంత కాలంగా అస్వస్థతతో తీసుకుంటున్నారు.ఆమె శుక్రవారం (మార్చి 3)న తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 93 ఏళ్లు.
ప్రముఖ కవి ఆరుద్ర సతీమణి.. కూచి రామలక్ష్మి (93) ఇకలేరు. వయోభారం, అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మలక్‌పేటలోని తన పెద్ద కుమార్తె కవిత ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కే.రామలక్ష్మి స్వస్థలం కాకినాడ సమీపంలోని కోటనందూరు.
ఆమె కొంత కాలం పాత్రికేయురాలిగా కూడా పని చేశారు. కే.రామలక్ష్మి పలు కథలు, నవలలు, విమర్శనా వ్యాసాలు, సినిమా సమీక్షలు రాశారు. అంతే కాకుండా ఆమె పలు సినిమాలకు కథ, మాటలు అందించారు. జీవన జ్యోతి , చిన్నారి పాపలు, గోరింటాకు వంటి సినిమాలకు కథ, మాటలు అందించారు.