సినీఫక్కీలో చర్లపల్లి ఖైదీ పరారీ?
posted on Jul 4, 2012 @ 11:25AM
ఖైదీ సినిమాలో హీరో కదులుతున్న వాహనంలో నుంచి దూకి పరారయ్యాడు. ఇలా పారిపోయిన ఖైదీ తిరిగి విలన్‌ల ముందు ప్రత్యక్షమవుతాడు. అలానే ఇదే సినీఫక్కీలో చర్లపల్లి ఖైదీ పరారయ్యాడు. అతనూ వాహనంలో నుంచి దూకి రైల్వేగేటు వద్ద కనిపించకుండా పోయాడు. పోలీసులు వెతికివేసారి చివరికి విషయాన్ని ఉన్నతాథికార్లకు సినిమాలోలానే వివరించారు. పరారైన ఖైదీ ‘ఖైదీ’ సినిమా చూసే ఉంటాడని చర్లపల్లి రైల్వేగేటు సమీప వాసులు అంటున్నారు. లేకపోతే అంతలా పారిపోవటానికి స్ఫూర్తి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. నిర్మల్‌కోర్టులో హాజరుపరిచి ఆ తరువాత ఖైదీని తిరిగి చర్లపల్లి తీసుకువెడుతుండగా ఈ సంఘటన జరిగింది. వెంకటేశ్వరరావు అనే ఈ ఖైదీ కదులుతున్న వాహనంలో నుంచి దూకి పరారయ్యాడు. పోలీసు వాహనంలో ఈయన్ని చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీంతో పోలీసులు ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద, అతని స్నేహితుల ఇళ్ల వద్ద, ఇతర ప్రాంతాల్లోనూ మఫ్టీలో కాపలా పెట్టారని సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ ఏడాది తప్పించుకున్న రిమాండ్ ఖైదల్లో వెంకటేశ్వరరావు ఏడో వ్యక్తి.