5జీ సేవలు ఆరంభించిన ప్రధాని
posted on Oct 1, 2022 @ 12:44PM
భారత్ మొబైల్ కాంగ్రెస్ 2022ను ఢిల్లీలో భారత్ ప్రధాని నరేంద్రమోదీ 5జీ సేవలు ప్రారంభించారు. దీంతో చాలా కాలం నుంచి అందరూ ఎదురుచూస్తున్న 5జీ సేవలు 13 ప్రధాన నగరాల్లో అమల్లోకి వస్తా యి. 5జీని ప్రారంభించిన వెంటనే ప్రధాని రెలియన్స్ జీయో పెవిలియన్ పైకి వెళ్లి ట్రూ 5జీ పరికరాన్ని ధరించి ఆ అనుభవాన్ని ఆస్వాదించారు. 5జీ పరికరం వినియోగం గురించి ప్రధానికి రెలియన్స్ ఛీఫ్ ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వివరించారు. జియో సంస్థకు ఆకాష్ ఇటీవలే ఛైర్మన్ అయిన సంగతి తెలిసిందే. 5జీ ప్రారంభోత్సవంలో టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ; సహాయమంత్రి టెలికాం మంత్రి దేవుసింహ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు.
ఇన్నాళ్లుగా మనం వాడుతున్న 4జీ సేవలకు అనేక రెట్ల వేగంతో 5జీ నెట్‌వర్క్‌లు పనిచేస్తాయి. ఈ రెం డింటికీ మధ్య ఉన్న తేడాల్లో అత్యంత ప్రధానమైనది.. లాటెన్సీ. అంటే.. స్పందించే వేగం. ఉదాహర ణకు మనం గూగుల్ ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్‌బార్‌లో సంబంధిత పదాన్ని టైప్ చేసి ఎంటర్ కీని నొక్కుతాం. మనం ఇచ్చిన ఆ ఆదేశానికి 4జీ నెట్‌వర్క్ అయితే.. 60 మిల్లీ సెకన్ల నుంచి 80 మిల్లీ సెకన్లలో స్పందించి సెర్చ్ చేయడం మొదలుపెడుతుంది. అంటే 4జీలో లాటెన్సీ 60-80 మిల్లీసెకన్లు ఉంటుంది. అదే 5జీలో ఈ సమయం 5 మిల్లీసెకన్ల కన్నా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వేగం పెరుగు తుంది.
4జీలో గరిష్ఠ డౌన్‌లోడ్ వేగం 1జీబీపీఎస్ (గిగాబిట్స్ పర్ సెకన్) 5జీలో అది 10 జీబీపీఎస్. దీనివల్ల అత్య ధిక నాణ్యత, నిడివి కలిగిన వీడియోలను, సినిమాలను సైతం సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 4జీ-5జీ సేవల మధ్య ఉన్న మరో ప్రధానమైన తేడా సమాచార ప్రసార విధానం. 4జీలో సమాచార సంకే తాలు సెల్‌టవర్ల నుంచి ప్రసారమవుతాయి. 5జీలో అయితే.. ఇందుకు స్మాల్ సెల్ టెక్నాలజీని వాడుతా రు. అంటే.. పిజ్జాబాక్సుల సైజులో ఉండే చిన్న సెల్స్ ద్వారా హైబ్యాండ్ 5జీ సేవలను అందుబాటులోకి తెస్తారు. అలాంటి బాక్సులను అమర్చలేని చోట, తక్కువ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌లున్న చోట.. సెల్ టవర్లనే వినియోగిస్తారు.