రేపు విశాఖకు ప్రధాని
posted on Jan 7, 2025 @ 1:13PM
ప్రధాని నరేంద్రమోడీ రేపు అంటే బుధవారం విశాఖపట్నం రానున్నారు. విశాఖ పూడి మడకవద్ద ఎన్ టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు ఎనిమిదో తేదీ సాయంత్రం శంకు స్థాపన చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది. విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం దాదాపు 19, 500 కోట్లతో చేపట్టనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణ పట్నం ఇండస్ట్రియల్ పార్కు తిరుపతి జిల్లాలో మోదీ శంకు స్థాపన చేయనున్నారు.