రాహుల్ గాంధీకి మన్మోహన్ లైన్ క్లియర్
posted on Jan 3, 2014 @ 11:03AM
ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే తాను మళ్ళీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టబోనని ప్రకటించారు. రాహుల్ గాంధీకి ప్రధాని కాగల అన్నిఅర్హతలు ఉన్నాయని, అతని సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వము, దేశం అన్నీ మంచి ప్రగతి సాధిస్తాయనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఆయన ప్రకటన రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలనే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలని స్పష్టంగా ప్రతిభింపజేస్తోంది. ఆయన రేసు నుండి తప్పుకొంటున్నట్లు విస్పష్టంగా ప్రకటించడం పూర్తయింది గనుక, ఇక త్వరలోనో మంచి రోజు చూసుకొని కాంగ్రెస్ అధిష్టానం యువరాజ పట్టాభిషేక ప్రకటన కూడా చేయవచ్చును.