తెలుగు వన్ కు ప్రతిష్టత్మక డైమండ్ క్రియేటర్ అవార్డు
posted on Feb 28, 2024 8:04AM
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ గా అగ్రస్థానంలో నిలిచిన తెలువన్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. కోటి మంది సబ్ స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ చానెల్ గా న్యూయార్క్ సొసైటీ ద్వారా డైమండ్ క్రియేటర్ అవార్డును దక్కించుకుంది. కోటి మంది సబ్ స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ చానళ్లకు న్యూయార్క్
కోటి మంది సబ్‌స్క్రైబర్‌లను చేరుకున్న యూట్యూబ్ ఛానళ్ళకు మాత్రమే ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డును 2012లో ప్రవేశ పెట్టారు. 2013లో సిల్వర్ క్రియేటర్, 2015లో డైమండ్ క్రియేటర్ అవార్డును ప్రవేశ పెట్టారు.
. తెలుగువన్ చానల్ కు దక్కిన ఈ గౌరవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవంగా పలువురు అభివర్ణిస్తున్నారు. తెలుగువన్ చానల్ అధినేత, రాజధాని ఫైల్స్ నిర్మాత కంఠమనేని రవిశంకర్ కు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు.