రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎలా ఓటు వేస్తారు
posted on Jun 29, 2012 @ 10:42AM
అక్రమ ఆస్తుల కేసులో చంచల్‌గూడా జైల్లో ఉన్న జగన్ రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల సమయానికి కూడా బెయిల్ రాకపోతే పరిస్థితి ఏంటని పార్టీవర్గాలు, మేధావివర్గాన్ని, న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. న్యాయనిపుణుల సలహామేరకు వైయస్సార్ పార్టీనాయకులు జగన్‌జైల్లో ఉన్నవిషయాన్ని ఎన్నికల కమీషన్ కు తెలియచేసి అక్కడే ఓటింగ్ ఏర్పాటు చేయమనవచ్చు. రాష్ట్రపతి పోలింగ్‌ను పార్లమెంటులోనే కాక ఆయా రాష్ట్రాల అసెంబ్లీలోను నిర్వహిస్తారు కాబట్టి రాజ్యసభ , పార్లమెంటు సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే వారి రాష్ట్రాల నుండే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అందువల్ల జగన్ జైల్లో నుండి బయటకు రావడానికిగాను న్యాయస్ధానం అనుమతి తీసుకోవలసి వస్తుంది. కోర్టు దానికి సానుకూలంగా స్పందింస్తే జగన్ అసెంబ్లీకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇది ఇలా వుండగా ఎవరికి ఓటువేస్తారో ఇంకా వైసిపి తేల్చుకోలేదు. కాంగ్రెస్ అధిష్టాన ఎంఐయం పార్టీ నాయకులు పార్లమెంటు సభ్యుడు అయిన అసవుద్దీన్ ఒవైసీని పంపి మతతత్వ రాజకీయాలకు ఓటు వేయకండని చెప్పించారు. అలాగే సంగ్మా కూడా మద్దతు అడగటానికి వచ్చినప్పుడు జైలు అధికారులు అనుమతించక పోవడంతో ఆయన వైసిపి పార్టీ అధినేత్రి విజయమ్మను కలసి ఓట్లకోసం అభ్యర్థిచటం తెలిసిందే. ఇప్పటికి కూడా వైసిపి తమ ఓట్లు ఎవరికి నిర్ణయించారో ప్రకటించలేదు.