కొత్త సంవత్సరానికి ప్రణబ్ మన రాష్ట్రంలోనే
posted on Dec 26, 2012 @ 10:04AM
ఈ సారి నూతన సంవత్సర వేడుకలను రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లోనే జరుపుకోనున్నారు. వారం రోజుల శీతాకాలం విడిది కోసం ప్రణబ్ నేడు హైదరాబాద్ వస్తున్నారు.
బేగంపేట్ లో ఆయన దిగిన వెంటనే బొల్లారం లోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఆయన మొత్తం ఐదు రోజుల పాటు బొల్లారంలో ఉంటారు. ప్రణబ్ జనవరి 2 వరకూ ఇక్కడే ఉంటారు. రేపు ప్రణబ్ తిరుపతిలో జరిగే నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించిన అనంతరం తిరిగి అదే రోజు సాయంత్రం హైదరాబాద్ వస్తారు.
28 వ తేదీ ఉదయం ప్రణబ్ చెన్నై వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ వస్తారు. ఆ తర్వాత ఉదయం ఆయన మహారాష్ట్ర వెళ్లి సోలాపూర్ వెళ్లి అక్కడ నిర్మల్ కుమార్ ఫాడ్కులే ఆడిటోరియం ను ప్రారంభిస్తారు. తిరిగి రాష్త్రపతి 30 వ తేదీ హైదరాబాద్ వచ్చి, జనవరి 2 వ తేదీ వరకూ ఇక్కడే ఉంటారు.
ఈ సమయంలో ఆయన రాష్ట్రంలో జరిగే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇక్కడ నుండే ఆయన కోల్ కతా వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి ఏడాది శీతాకాలంలో దక్షిణ భారతదేశంలో పర్యటించే రాష్త్రపతి బొల్లారంలో బస చేయడం ఆనవాయితీ.