బిఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా
posted on Mar 16, 2024 @ 3:29PM
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటుచేసుకుంది. బీఎస్పీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ప్రవీణ్ రాజీనామా చేశారు. లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ప్రవీణ్ కుమార్ బిఎస్ పికి రాజీనామా చేశారు. కవిత అరెస్ట్ అయిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ లో ఆయన చేరబోతున్నారు. కేసీఆర్ తో ప్రవీణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చిందని తెలిపారు. కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి రోజులు కూడా గడవకుండానే ఆయన బీఎస్పీకి రాజీనామా చేయడం గమనార్హం.
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరుగా. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్. ప్రవీణ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బద్ద శత్రువులు. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో బిఆర్ఎస్ ఓడిపోయింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలువరించడాానికి బిఆర్ ఎస్, బిఎస్ పిలు ఎన్నికల పొత్తు పెట్టుకున్నాయి. పార్లమెంటు ఎన్నికల బీఆర్ఎస్- బీఎస్పీ పొత్తులో భాగంగా సీట్ల షేరింగ్‌పై క్లారిటీ వచ్చింది. ఇరుపార్టీలు జరిపిన చర్చల అనంతరం.. రెండు సీట్లను బీఎస్పీకి కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని ప్రవీణ్ కుమార్ భావించినట్లు తెలుస్తోంది. వెంటనే బిఎస్ పికి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరనున్నట్టు సమాచారం.